మసాజ్ చేయాలంటూ యువతికి Phone Call.. మొదట నిరాకరించి.. చివరికి ఒప్పుకొని అతని ఇంటికెళ్లగా..!

ABN , First Publish Date - 2022-02-03T13:19:29+05:30 IST

మసాజ్ చేయాలంటూ యువతికి Phone Call.. మొదట నిరాకరించి.. చివరికి ఒప్పుకొని అతని ఇంటికెళ్లగా..!

మసాజ్ చేయాలంటూ యువతికి Phone Call.. మొదట నిరాకరించి.. చివరికి ఒప్పుకొని అతని ఇంటికెళ్లగా..!

  • పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి


హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై పలుమార్లు అత్యాచారం చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన ఓ యువతి చర్మ సౌందర్యానికి చెందిన లేహ్యాలు, పౌడర్ల వ్యాపారం చేస్తుంటుంది. ఆమె వద్ద కొనుగోలు చేసే ఓ వినియోగదారురాలి భర్త మహ్మద్‌ ఖాలేద్‌ అలీతో పరిచయం ఏర్పడింది. గతేడాది తనకు తీవ్రమైన తలనొప్పి ఉందని, మసాజ్‌ చేయాలంటూ యువతికి ఖాలేద్‌ ఫోన్‌ చేశాడు. మొదట నిరాకరించిన యువతి ఖాలేద్‌ ఒత్తిడి తేవడంతో ఒప్పుకొని కమలాపురి కాలనీలోని అతడి ఇంటికి వెళ్లగా బంధించి అత్యాచారం చేశాడు. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 2021 మార్చిలో ఓ గెస్ట్‌హౌస్‌కు తీసుకువెళ్లి మళ్లీ అత్యాచారం చేశాడు. యువతి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని కోరగా బెదిరించాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు కోర్టును ఆశ్రయించి సాక్షాధారాలు అందించింది. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-02-03T13:19:29+05:30 IST