మార్మోగిన శివనామస్మరణ

ABN , First Publish Date - 2022-05-17T06:12:02+05:30 IST

శివనామస్మరణతో సోమవారం కొత్తచెరువులో సంగ మేశ్వరస్వామి రథోత్సవం కన్నులపండువగా సాగింది.

మార్మోగిన శివనామస్మరణ
రథోత్సవానికి హాజరైన భక్తులు

కన్నుల పండువగా సంగమేశ్వరస్వామి రథోత్సవం

హాజరైన మాజీ మంత్రి పల్లె

కొత్తచెరువు, మే16: శివనామస్మరణతో సోమవారం కొత్తచెరువులో సంగ మేశ్వరస్వామి రథోత్సవం కన్నులపండువగా సాగింది. స్థానిక సంగమేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉదయం 11గంటల కు హరహర మహదేవ అంటూ భక్తులు తేరును ముందుకు లాగారు. ప్రతి ఏటా సంగమేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. రథోత్సవం వేలాది భక్తుల నడుమ ఎంతో వైభవంగా జరుగుతుంది. వారం రోజుల నుంచి స్వామి బ్రహ్మోత్సవాలను కందికేర వంశీకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తు న్నారు. అందులో భాగంగా ఆదివారం రాత్రి స్వామి వారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం ఆలయ ధర్మకర్త ఇంటి నుంచి స్వామివారికి ప్రత్యేక పూజా సామాగ్రి, జెండాను ఆలయానికి తీసుకొ చ్చారు. పార్వతి, సంగమేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను వేదపండితులు ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. వాటిని పల్లకిలో మోసు కెళ్లి రథంపై ఉంచారు. భక్తులు పెద్దఎత్తున ఓ నమఃశివాయ అంటూ రథాన్ని లాగారు. ఆలయ ధర్మకర్త మనోహర కుటంబసభ్యులు తేరువద్దకు చేరుకుని భక్తులతో కలిసి తేరును లాగారు. సాయంత్రం యఽథాస్థానంలోకి చేర్చారు సంగమేశ్వరస్వామి రథోత్సవంలో మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు.  సీఐ నరసింహ రావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ లింగన్న పోలీసు బందోబస్తు నిర్వహించారు. 

రథోత్సవంలో పలువురి సేవలు

సంగమేశ్వర స్వామి రథోత్సంలో పలువురు భక్తులు సోమవారం సేవలం దించారు. కొందరు తాగునీరు, మరికొందరు మజ్జిగ, అన్నప్రసాదం అందజేశారు. కొత్తచెరువుకు చెందిన తేజదంతవైద్యశాల ఆధ్వర్యంలో దంతవైద్యు రా లు పీవీ తేజ మజ్జిగ, తాగు నీటిని భక్తులకు పంపిణీ చే శారు. వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్డె వెంకట్‌ ఆ ధ్వర్యంలో అన్నదాన కార్య క్రమం చేపట్టారు. పలు వు రు భక్తులు అన్నప్రసా దం, తాగునీరు అందజేశారు. 

Updated Date - 2022-05-17T06:12:02+05:30 IST