రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో మార్కెట్‌ విలువలు

ABN , First Publish Date - 2020-08-04T11:03:14+05:30 IST

జిస్ట్రేషన్‌-స్టాంపుల శాఖ వెబ్‌సైట్‌లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నెల్లూరు అర్భన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ..

రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో మార్కెట్‌ విలువలు

నెల్లూరు(హరనాథపురం), ఆగస్టు 3: రిజిస్ట్రేషన్‌-స్టాంపుల శాఖ వెబ్‌సైట్‌లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నెల్లూరు అర్భన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో పెంచడానికి ఉద్ధేశిం చిన భూములు, స్థలాల విలువలు, కాంపోజిట్‌ విలువలు ఉంచామని ఆ శాఖ డీఐజీ కే.అబ్రహం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిపై ప్రజలు సలహాలు, సూచనలు, అభ్యంతరా లు తెలియచేయాలని కోరారు. వాటిని వారి వారి పరిధిలోని  సబ్‌రిజిస్ట్రార్‌కు తెలపాలన్నారు. ప్రజల అర్జీలపై కమిటీ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకొంటుందని తెలిపారు. 


Updated Date - 2020-08-04T11:03:14+05:30 IST