తాత్కాలిక మార్కెట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-03-25T12:49:25+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలో తాత్కాలిక మార్కెట్లో రైతులకు, ప్రజలకు మార్కెట్‌ కమిటీ వసతులు కల్పించింది. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, హైస్కూల్‌ గ్రౌండ్‌, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లలో కూరగాయలను

తాత్కాలిక మార్కెట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

  • సిద్దిపేటలో రైతులకు, ప్రజలకు సదుపాయాలు


సిద్దిపేట సిటీ, మార్చి 24: లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలో తాత్కాలిక మార్కెట్లో రైతులకు, ప్రజలకు మార్కెట్‌ కమిటీ వసతులు కల్పించింది. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, హైస్కూల్‌ గ్రౌండ్‌, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లలో కూరగాయలను విక్రయించే రైతులకు తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లును ఏర్పాటు చేసింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు రైతులు కూరగాయలను  విక్రయించే అవకాశం కల్పించింది. మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్‌ పాలసాయిరాం రాత్రికి రాత్రి ప్రత్యేక టెంట్లు వేయించి, సమాజిక దూరం పాటిస్తూ కూరగాయలను కొనేలా చేశారు. ధరల పట్టికను ఏర్పాటు చేశారు. ప్రజలకు కరోనా నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాం, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2020-03-25T12:49:25+05:30 IST