ఖమ్మం మిర్చిమార్కెట్‌ అడ్డాగా అక్రమ దందా

ABN , First Publish Date - 2021-06-17T05:14:02+05:30 IST

ఖమ్మం మిర్చిమార్కెట్‌ అడ్డాగా అక్రమ దందా కొనసాగుతుందని వర్తకసంఘాలు, అధికారులు, రాజకీయ ప్రతినిధుల అండతో నకిలీ వ్యాపారులు రెచ్చిపోతున్నారని, రైతులకు కోట్లరూపాయలు ఎగనామం పెడుతున్నారని తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు ఆరోపించారు.

ఖమ్మం మిర్చిమార్కెట్‌ అడ్డాగా అక్రమ దందా

తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు రాంబాబు 

వైరా, జూన్‌ 16: ఖమ్మం మిర్చిమార్కెట్‌ అడ్డాగా అక్రమ దందా కొనసాగుతుందని వర్తకసంఘాలు, అధికారులు, రాజకీయ ప్రతినిధుల అండతో నకిలీ వ్యాపారులు రెచ్చిపోతున్నారని, రైతులకు కోట్లరూపాయలు ఎగనామం పెడుతున్నారని తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు ఆరోపించారు. బుధవారం వైరాలోని బోడేపూడి వెంకటేశ్వరరావు భవన్‌లో జరిగిన రైతుసంఘ సమావేశంలో రాంబాబు మాట్లాడారు. కొంతమంది నకిలీ వ్యాపారులు రైతులను నమ్మించి మిర్చి కొనుగోలు చేసి వ్యాపారంలో నష్టం వచ్చిందనే సాకుతో కోర్టులను ఆశ్రయించి దివాళా పిటిషన్‌ దాఖలు చేసి ఎగనామం పెడుతున్నారని విమర్శించారు. ఖమ్మం మిర్చిమార్కెట్‌ కేంద్రంగా ఏన్కూరు, తల్లాడలను ఉపకేంద్రాలుగా చేసుకొని రైతులను అధిక ధరల పేరిట నమ్మించి దోచుకుంటున్నారని ఆరోపించారు. మూడునెలల నుంచి వేలాదిమంది రైతులు ముఖ్యంగా 90శాతంమంది గిరిజన రైతులు మిర్చి అమ్ముకొని చేతికి డబ్బురాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో మిర్చిరైతులకు జరుగుతున్న నష్టంపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, జిల్లా అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని లేనట్లయితే ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతుసంఘం నాయకు లు చింతనిప్పు చలపతిరావు, సుంకర సుధాకర్‌, తోట నా గేశ్వరరావు, సంక్రాంతి నర్సయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.


Updated Date - 2021-06-17T05:14:02+05:30 IST