Abn logo
Jul 4 2020 @ 05:22AM

మార్కాపురం లాక్‌

అమల్లోకి సంపూర్ణ ఆంక్షలు


మార్కాపురం, జూలై 3 : పట్టణంలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు  సంపూర్ణ ఆంక్షలు విధించారు. శుక్రవారం నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. శని, ఆదివారాలు కూడా కొన సాగనున్నాయి. తొలి రోజు కేవలం మందుల దుకా ణాలు మాత్రమే పని చేశాయి.  ఎక్కువ మంది స్వ చ్ఛందంగా వ్యాపార సంస్థలను మూసివేశారు. ప్రజల ను రోడ్లపైకి రాకుండా పోలీసులు  కట్టడి చేశారు.


పట్టణంలోకి ప్రవేశించే ప్రధాన మార్గాలైన తర్లుపాడు రోడ్డు, ఎస్టేట్‌ రోడ్డు, కంభం రోడ్డులను మూసివేశారు. మార్కెట్‌ యార్డ్‌ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి అత్య వసర సేవలకు మాత్రమే ప్రజలను అనుమతించారు. ఉదయం మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో ఏర్పాటు చేసి న బారికేడ్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. పోలీ సులు అనుమతించకపోవడంతో కొద్దిసేపు వేచి ఉన్న ప్రజలు వెనుతిరిగారు. నిత్యావసర వస్తువులకు అను మతించిన నాలుగు సూపర్‌ మార్కెట్ల ద్వారా ప్రజలు వస్తువులను హోం డెలివరీ చేయించుకున్నారు.  

Advertisement
Advertisement
Advertisement