మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

ABN , First Publish Date - 2022-08-10T05:22:19+05:30 IST

మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉద్యమిం చి, ఆదివాసీ హక్కులను కాపాడుకోవాలని ఆదివాసీ సంఘాల పేరిట వెలసిన కరపత్రా లు గుండాల, కరకగూడెం, మణుగూరు, పినపాకలో కలకలం సృష్టించాయి.

మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
మణుగూరులో వెలసిన కరపత్రాలు

గుండాల, కరకగూడెం, మణుగూరు, పినపాకలో వాల్‌పోస్టర్లు

గుండాల/ కరకగూడెం/ మణుగూరు, ఆగస్టు 9: మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉద్యమిం చి, ఆదివాసీ హక్కులను కాపాడుకోవాలని ఆదివాసీ సంఘాల పేరిట వెలసిన కరపత్రా లు గుండాల, కరకగూడెం, మణుగూరు, పినపాకలో కలకలం సృష్టించాయి. మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో వాల్‌పోస్టర్లు, కరపత్రాలు గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్లు సమాచారం. ‘మావోయిస్టులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నంత వరకు గిరిజన గ్రామాలు అభివృద్ధికి నోచుకోకపోగా, పిల్లల భవిష్యత్‌ను వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఆదిలోనే బలి చేస్తున్నారని’ లేఖల్లో పేర్కొన్నారు. ‘గ్రామాలకు రోడ్లు వేయనివ్వరు. కరెంట్‌ రానివ్వరు. పిల్లల్ని బడికి వెళ్లనివ్వరు. పైగా ఇటీవల వచ్చిన వరదలతో సర్వం కోల్పోయి పూటగడవక కష్టాల్లో ఉంటే బియ్యం తీసుకొని మీటింగ్‌లకు రావాలని, లేకపోతే రూ. మూడువేలు జరిమానా చెల్లించాలని ఆదివాసీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ప్రజా కోర్టుల పేరుతో ఆమాయక గిరిజనులను క్రూ రంగా చంపుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్క గ్రామంలో అయినా అభివృద్ది పనులు చేశారా’ అని కరపత్రాల్లో  ప్రశ్నించారు. 

కరపత్రాలు, పోస్టర్లకు తమకు ఎటువంటి సంబంధం లేదని ఆదివాసీ సంఘాల నా యకులు పేర్కొంటున్నారు. ఈ విషయమై మణుగూరు సీఐ ముత్యం రమేష్‌, కరకగూడెం ఎస్‌ఐ నాగభిక్షాన్ని వివరణ కోరగా కరత్రాలు ఎవరు వేశారన్న కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. 

Updated Date - 2022-08-10T05:22:19+05:30 IST