అనేక మందికి మాపై నమ్మకం లేదు: ట్విటర్ సీఈఓ

ABN , First Publish Date - 2021-02-27T00:30:52+05:30 IST

సోషల్ మీడియాలోని కంటెంట్‌ను నియంత్రించేందుకు కేంద్రం ఇటీవల ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే..ఈ విషయంపై ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ తొలిసారిగా శుక్రవారం నాడు స్పందించారు

అనేక మందికి మాపై నమ్మకం లేదు: ట్విటర్ సీఈఓ

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలోని కంటెంట్‌ను నియంత్రించేందుకు కేంద్రం ఇటీవల ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే..ఈ విషయంపై ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ తొలిసారిగా శుక్రవారం నాడు స్పందించారు. ‘అనేక మంది మమ్మల్ని నమ్మరన్న విషయాన్ని మేమూ అంగీకరిస్తున్నాం. గత కొన్నేళ్లలో ఈ వైఖరి మరింత ప్రస్ఫుటమైంది. అయితే..మేము మాత్రమే ఈ పరిస్థితిని ఎదుర్కొవట్లేదు. ఇతర వ్యవస్థలు కూడా ఇదే స్థితిలో ఉన్నాయి’ సోషల్ మీడియా కంటెంట్ నియంత్రణ కోసం కేంద్రం ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేసిన మరుసటి రోజే ట్విటర్ సీఈఓ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రైతుల నిరసన సందర్భంగా కొన్ని అకౌంట్లపై నిషేధం విధించాలంటూ కేంద్రం ట్విటర్‌ను కోరిన విషయం తెలిసిందే. అయితే.. భారవ్యక్తీకరణ స్వేఛ్చను రిక్షించాల్సి ఉందంటూ ట్విటర్ కొంత కాలం పాటు ప్రభుత్వ ఆదేశాలను సమీక్షించి ఆ తరువాత అమలు పరిచింది. 


Updated Date - 2021-02-27T00:30:52+05:30 IST