మనఊరు - మనబడితో బంగారు భవిత

ABN , First Publish Date - 2022-05-18T06:59:55+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మన ఊరు - మన బడితో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట పడనుందని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు.

మనఊరు - మనబడితో బంగారు భవిత
పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, తదితరులు

భైంసా, మే 17 :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మన ఊరు - మన బడితో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట పడనుందని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం భైంసా పట్టణం లోని అనసూయ పవార్‌నగర్‌ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పి. కృష్ణ, మున్సిపల్‌ కౌన్సిలర్‌ చందులాల్‌తో కలిసి మనఊరు - మనబడి మొదటివిడత కార్యక్రమాన్ని ప్రారంభించిన సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య,వైద్యం, వ్యవసాయ రంగాల్లో నెలకొని ఉన్న సమస్యలను శాశ్వతంగా  పరిష్కరించేందుకు గాను ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్ప న, సౌకర్యాల మెరుగుదలకు మనఊరు - మనబడి ద్వారా మూడువిడతల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక చేపడుతుందన్నారు. దాతలు ముందుకు వచ్చి  మనఊరు - మనబడికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సుభాస్‌,  ఏఎంసీ డైరెక్టర్‌ బాలాజీ పటేల్‌,  పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్‌, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు  తదితరులున్నారు. 

Updated Date - 2022-05-18T06:59:55+05:30 IST