మధురఫలం కొనేవారేరి..!

ABN , First Publish Date - 2021-05-28T05:25:12+05:30 IST

మధురఫలం మామిడి రైతు పరిస్థితి చేదుగా మారింది.

మధురఫలం కొనేవారేరి..!
ఉలవపాడు వద్ద జాతీయ రహదారి పక్కన ఏర్పాటుచేసిన దుకాణాలు

పండి రాలిపోతున్న మామిడిపండ్లు 

కందుకూరు, మే 27: మధురఫలం మామిడి రైతు పరిస్థితి చేదుగా మారింది. ఐదేళ్లుగా కరవుతో దిగుబడులు లేక తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ ఏడాది దిగుబడి ఫర్వాలేదని మురిసిపోయినా ఆ మురి పెం మూడునాళ్ల ముచ్చటే అయింది. మామిడి పంట చేతికొచ్చే స  మయానికి కరోనా విశ్వరూపం చూపడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది.  దీంతో  మామిడి పండ్లు కొనేనాథుడే కరవయ్యా రు. మామిడి తోటల్లోనే కాయలు పండి రాలిపోతున్నాయి. అయినా చేయగలిగింది లేకపోవడంతో మామిడి రైతులు పంటను తెగనమ్ము కుంటున్నారు. 

కందుకూరు డివిజన్‌లో  ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోనే 12 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగయ్యాయి. సింగరాయకొండ, కందుకూరు, వలేటివారిపాలెం, పొన్నలూరు, లింగసముద్రం తదితర మండలాల్లో మరో నాలుగు వేల ఎకరాలు మామిడితోటలు సాగులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 23 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు ఉండగా ఈ రైతులందరి పరిస్థితి దయనీయంగా మారింది. మామిడి సరాసరి దిగుబడి ఎకరానికి 4 టన్నులు కాగా, ఈ ఏడాది 3 టన్నుల వరకు దిగుబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గి ట్టుబాటు ధరలు లభించి ఉంటే రైతులకు మంచి లాభాలు వచ్చేవి. 

అయితే, లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ నగరాలలో మామి డి కాయలకు డిమాండ్‌ తగ్గింది. రవాణా సమస్యలతో వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రావడం లేదు. గతంలో ఈ ప్రాంత మామిడి కాయలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, పుణె, బిలాస్‌పూర్‌, ఢిల్లీ , బాంబే, విజయవాడ లాంటి నగరాలకు వెళ్లేవి. దీంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలోని ప్రధాన పట్టణాలకు పెద్ద ఎత్తున ఎగు మతి అయ్యేది. జిల్లాలోని ఒంగోలు, చీరాల, వేటపాలెం ప్రాంతాల చి రు వ్యాపారులైతే ఉలవపాడుకి వచ్చి మామిడికాయలు తీసుకెళ్లి అక్క డ అమ్ముకునేవారు. ఈ ఏడాది ఆయా నగరాలకు ఎగుమతులు పూర్తి గా ఆగిపోయాయి ఇక చిరు వ్యాపారులు సైతం కరోనాకు భయపడి ఇటు వైపు రావడంతో దీంతో మామిడి కాయలు చెట్ల పైనే పండి రాలిపోతున్నాయి. 

ఈ పరిస్థితుల్లో ఎగుమతి వ్యాపారులకు టన్ను రూ.50వేల నుండి రూ.60వేలకు తగ్గకుండా అమ్ముకోవాల్సిన రైతులు ప్రస్తుతం రిటైల్‌ మార్కె ట్‌లో కిలో రూ.20, 25కి తెగనమ్ముకుంటున్నారు. బంగినపల్లి రకానికి ఈ ధర లభిస్తుండగా బెంగళూరు రకాలకైతే కిలోకి ఏడెనిమి ది రూపాయలు మాత్రమే దక్కుతోంది. ఉలవపాడు జాతీయ రహదా రిపై ఏర్పాటుచేసిన దుకాణాలు, స్థానికంగా గ్రామాలలో ఆటోలలో వేసుకుని రిటైల్‌ వ్యాపారులు ప్రస్తుతం పళ్లను అమ్ముతున్నారు. ఉలవ పాడు, సింగరాయకొండ మార్కెట్లపైనే ఆధారపడి వేలటన్నుల మామి డి కాయలు అమ్ముకోవాల్సి రావడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 

ఎగుమతులు లేక నష్టపోతున్నాం

 - మర్రిబోయిన శ్రీహరి, మామిడిరైతు, కొల్లూరుపాడు, ఉలవపాడు మండలం 

ఈ ఏడాది ఆశించిన స్థాయిలో మామిడి దిగుబడులు వచ్చినప్పటికీ ఎగుమతులు లేవు. దీంతో ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నాం. నాకు సొంతగా మామిడి తోటలు ఉన్నాయి. దీంతో పాటు మామిడి తోటల ఫలసాయం కౌలుకి తీసుకునే వ్యాపారం చేస్తున్నారు.  ఈ ఏడాది ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో 70 ఎకరాలు కౌలుకి తీసుకున్నాను. అయితే ఎగుమతి వ్యాపారులు రాలేదు. దీనికి తోడు గత నాలుగు రోజులుగా వీస్తున్న ఎత్తుగాలులకు కాయలు చెట్లనే పండి రాలిపోతున్నాయి.  బంగినపల్లి మేలురకం కాయలు కిలో రూ. 25కి, రెండవ రకం కాయలు కిలో రూ. 20కి అమ్ముకోక తప్పడం లేదు. బెంగళూరు రకాలైతే జ్యూస్‌ ఫ్యాక్టరీలకు కిలో 8 రూపాయలకే అమ్మేస్తున్నాం. దీంతో ఈ ఏడాది పంట దిగుబడి ఉన్నా పెట్టుబడులు చేతికొస్తాయా లేదా అన్న ఆందోళన కలుగుతోంది.

Updated Date - 2021-05-28T05:25:12+05:30 IST