Abn logo
Aug 3 2021 @ 23:58PM

వన మహోత్సవ ఏర్పాట్ల పరిశీలన

ఎయిమ్స్‌ ప్రాంగణంలో వనమహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తదితరులు

మంగళగిరి, ఆగస్టు 3: ఎయిమ్స్‌ ప్రాంగణంలో గురువారం వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొననున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆ ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ వనమహోత్సవంలో ఎంబీబీఎస్‌ విద్యార్థులు, వలంటీర్లు, మహిళలు పాల్గొంటారపి తెలిపారు. నాలుగు వేల మొక్కలు నాటేందుకు  అటవీశాఖ ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు. సీఎం జగన్‌ ఐదోతేదీ ఉదయం పది గంటలకు ఇక్కడికి చేరుకుని గంటన్నరపాటు ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో పాల్గొనే వారందరూ విధిగా మాస్కులను ధరించాలన్నారు.  అర్బన్‌ జిల్లా ఎస్పీ ఆరీఫ్‌హఫీజ్‌ మాట్లాడుతూ ముఖ్య అతిఽథులు ప్రయాణించే మార్గాలలో ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపడతామన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్‌లు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, కే శ్రీధర్‌రెడ్డి, జిల్లా అటవీశాఖాధికారి రామచంద్రరావు, గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, ఎంటీఎంసీ కమిషనరు పి.నిరంజన్‌రెడ్డి, అదనపు కమిషనరు కె.హేమమాలినిరెడ్డి, డిప్యూటీ కమిషనరు రవిచంద్రారెడ్డి, తహసీల్దారు జేవీ శివరామ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.