పెంపుడు జంతువులతో కరోనా.. మనేకా గాంధీ ఏం చేస్తున్నారంటే?

ABN , First Publish Date - 2020-04-10T23:11:11+05:30 IST

పెంపుడు జంతువుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వార్తలు జంతుప్రేమికుల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే.

పెంపుడు జంతువులతో కరోనా.. మనేకా గాంధీ ఏం చేస్తున్నారంటే?

ముంబై: పెంపుడు జంతువుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వార్తలు జంతుప్రేమికుల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ఓ జూలో పులికి కరోనా వచ్చిందన్న సమాచారంతో ఈ ఆందోళనలు మరింత ఎక్కువ అయ్యాయి. ఇంతకూ జంతువుల ద్వారా వైరస్ సోకుతుందా? లేదా? ఈ నేపథ్యంలో దీనిపై కేంద్ర మంత్రి, జంతు ప్రేమికురాలు మనేకా గాంధీ ఓ అవగాహన కార్యక్రమం చేపట్టారు. పలువురు సినీ, వైద్యరంగ ప్రముఖులతో దీనిపై మాట్లాడిస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  


మనేకా సంజయ్ గాంధీ(కేంద్ర మంత్రి): అందరూ దయచేసి వినండి. పిల్లికి కరోనా సోకదు. దాని ద్వారా వ్యాప్తి చెందదు. జూలో ఓ పులికి కరోనా సోకిందన్న విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పిల్లి.. పులి కాదు. వాటి మధ్య ఎలాంటి సంబంధం లేదు. అవి మనకు పెద్ద ఆస్తి. పిల్లులతో ఎలాంటి ప్రమాదం లేదు. వాటికి ఆహారాన్నివ్వండి. దాన్ని కాలనీలోకి రానివ్వండి.  




టైగర్ ష్రాఫ్(సినీ హీరో): పెంపుడు జంతువులతో కరోనా వైరస్ వ్యాప్తి చెందదు. వాటిని వీధుల్లో విడిచిపెట్టకండి. వాటితో మీరు ఎంతో సమయం గడిపి ఉంటారు. మరోసారి గుర్తు చేస్తున్నాను. అవి వ్యాప్తి చేయవు. వ్యాధికి గురికావు. జంతువులను కాపాడండి. ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి. 




ముఖేశ్ బత్రా(హోమియో వైద్యుడు): హోమియో వైద్యంలో 45 ఏళ్ల అనుభవం నాది. జంతువులకు కూడా హోమియో వైద్యం చేశాను. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పెంపుడు జంతువులపై కోవిడ్ -19 ప్రభావం చూపదు. జాగ్రత్తగా ఉండండి.  



Updated Date - 2020-04-10T23:11:11+05:30 IST