పాములు పట్టడంలో ఎక్స్‌పర్ట్.. 40 ఏళ్లుగా అదే పని.. చివరకు అతను ఎలా చనిపోయాడంటే..

ABN , First Publish Date - 2022-07-03T21:56:54+05:30 IST

ఎప్పుడూ తుపాకీ పట్టుకుని తిరిగే వాడు, తుపాకీ వల్లే చనిపోతాడనేది ఓ సామెత.

పాములు పట్టడంలో ఎక్స్‌పర్ట్.. 40 ఏళ్లుగా అదే పని.. చివరకు అతను ఎలా చనిపోయాడంటే..

ఎప్పుడూ తుపాకీ పట్టుకుని తిరిగే వాడు, తుపాకీ వల్లే చనిపోతాడనేది ఓ సామెత. అలాగే 40 ఏళ్లుగా పాములు పడుతూ జీవిస్తున్న ఓ వ్యక్తి పాము కాటుకే బలైపోయాడు. పాములను పట్టుకోవడంలో నిపుణుడిగా పేరుగాంచిన ఓ వ్యక్తి పాము కాటుకు గురై చనిపోయాడు. ఇండోర్‌లోని భగత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన అశోక్ మేవాడ (57) పాములు పట్టడంలో నిపుణుడు. గత 40 ఏళ్లలో ఎన్నో ప్రమాదకర పాములను ఒడుపుగా పట్టుకున్నాడు. శుక్రవారం సాయి సుమన్‌నగర్‌లోని ఒక వ్యక్తి అశోక్‌కు ఫోన్ చేసి తన ఇంట్లో పాము ప్రవేశించిందని చెప్పాడు. 


ఇది కూడా చదవండి..

Crime: పెళ్లైన నాలుగు నెలలకే దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త.. కారణమేంటంటే..


అశోక్ వెంటనే అక్కడకు వెళ్లాడు. పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా అది కాటు వేసింది. అయినా అశోక్ ఆ పామును పట్టుకుని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి వదిలేశాడు. తన శరీరం నుంచి కొంత విషాన్ని స్వయంగా తొలగించి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత అతని పరిస్థితి విషమించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అశోక్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శరీరమంతా విషం వ్యాపించడంతో శుక్రవారం రాత్రి హాస్పిటల్‌లో అశోక్ మరణించాడు. 


సమాచారం అందుకున్న పోలీసులు అశోక్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. అశోక్ కొడుకు జితేంద్ర మాట్లాడుతూ.. తన తండ్రికి అర్ధరాత్రి కూడా ఫోన్లు వచ్చేవని, ఎవరు ఫోన్ చేసినా వెంటనే వెళ్లేవాడని చెప్పాడు. అలాగే గత 40 ఏళ్లలో తను పట్టుకున్న ఒక్క పామును కూడా తండ్రి చంపలేదని, నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి వదిలేసేవాడని చెప్పాడు. అలాగే పాము కాటుకు గురైన వారిని కూడా రక్షించేవాడని తెలిపాడు. 

Updated Date - 2022-07-03T21:56:54+05:30 IST