జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇంట్లోకి ప్రవేశించేందుకు వ్యక్తి యత్నం

ABN , First Publish Date - 2022-02-16T17:27:34+05:30 IST

ఢిల్లీలోని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నివాసంలోకి ప్రవేశించేందుకు ఓ వ్యక్తి యత్నించిన ఘటన బుధవారం జరిగింది....

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇంట్లోకి ప్రవేశించేందుకు వ్యక్తి యత్నం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నివాసంలోకి ప్రవేశించేందుకు ఓ వ్యక్తి యత్నించిన ఘటన బుధవారం జరిగింది. జాతీయ భద్రతాదారుడి నివాసంలోకి ఓ వ్యక్తి కారులో వచ్చాడు. భద్రతను ఉల్లంఘించి అజిత్ దోవల్ నివాసంలోకి వెళ్లేందుకు యత్నిస్తుండగా ఢిల్లీ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. భద్రతను ఉల్లంఘించిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అజిత్ దోవల్ నివాసంలోకి వచ్చేందుకు యత్నించిన వ్యక్తి బెంగళూరు వాసి అని, అతని శరీరంలో చిప్ ఉందని, అతన్ని ఎవరో నియంత్రిస్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా సదరు నిందితుడిని ఎంఆర్ఐ స్కాన్ చేయగా చిప్ కనిపించలేదు. ఈ ఘటన అనంతరం ఢిల్లీ పోలీసులు అజిత్ దోవల్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.


Updated Date - 2022-02-16T17:27:34+05:30 IST