తండ్రి కోసం 2100 కిలోమీటర్లు సైకిల్‌పై

ABN , First Publish Date - 2020-04-06T07:30:54+05:30 IST

ఇటు లాక్‌డౌన్‌.. అటు తండ్రికి అనారోగ్యం! 2100 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ ఆయన దగ్గరకు వెళ్లలేడు. ముంబైలో ఉంటున్న ఆరిఫ్‌కు చివరకు సైకిలే దిక్కయింది. టాక్సీ నడుపుతూ ప్రైవేటు గార్డుగా అతను...

తండ్రి కోసం 2100 కిలోమీటర్లు సైకిల్‌పై

ఇటు లాక్‌డౌన్‌.. అటు తండ్రికి అనారోగ్యం! 2100 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ ఆయన దగ్గరకు వెళ్లలేడు. ముంబైలో ఉంటున్న ఆరిఫ్‌కు చివరకు సైకిలే దిక్కయింది. టాక్సీ నడుపుతూ ప్రైవేటు గార్డుగా అతను పనిచేస్తున్నాడు. ఎక్కడో జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో ఉంటున్న తండ్రి వజీర్‌ హుస్సేన్‌కు ఈ నెల 1న బ్రెయిన్‌ స్ర్టోక్‌ వచ్చింది. ఆయనను చూసేందుకు ఆరిఫ్‌ సైకిల్‌పైనే బయల్దేరాడు. ఈ విషయం తెలుసుకున్న సీఆర్పీఎఫ్‌ ఆరిఫ్‌కు అండగా నిలబడింది. వజీర్‌ హుస్సేన్‌ను హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించింది. మరో 4-5 రోజుల్లో అతను తన తండ్రిని కలుసుకోనున్నాడు. 

Updated Date - 2020-04-06T07:30:54+05:30 IST