Viral Video: సెక్యూరిటీ గార్డులపై దాడి.. సహాయం చేసినందుకు చెంప దెబ్బలు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-08-30T21:21:05+05:30 IST

ఇటీవల నొయిడాలోని ఓ గేటేడ్ కమ్యూనిటీలో ఓ మహిళ సెక్యూరిటీ గార్డును కొట్టిన ఉదంతం జరిగి 10 రోజులు కూడా గడవకముందే

Viral Video: సెక్యూరిటీ గార్డులపై దాడి.. సహాయం చేసినందుకు చెంప దెబ్బలు.. చివరకు ఏం జరిగిందంటే..

నొయిడాలోని ఓ గేటేడ్ కమ్యూనిటీలో ఓ మహిళ సెక్యూరిటీ గార్డును కొట్టిన ఉదంతం జరిగి 10 రోజులు కూడా గడవకముందే అలాంటి మరో ఘటన గురుగ్రామ్‌ (Gurgaon)లో జరిగింది. అందరూ మనుషులే అనే విచక్షణ లేకుండా సెక్యూరిటీ గార్డులు, వాచ్‌మెన్‌లతో కొందరు వ్యక్తులు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. తమ దగ్గర పని చేస్తున్న వారిని బానిసలుగా చూస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి తనను లిఫ్ట్ నుంచి కాపాడిన సెక్యూరిటీ గార్డు, లిఫ్ట్‌ మ్యాన్‌పై చేయి చేసుకున్నాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.


గురుగ్రామ్‌లోని ద క్లోజ్ నార్త్ సొసైటీలో నివాసం ఉంటున్న వరుణ్ నాథ్ అనే వ్యక్తి 14వ అంతస్తు నుంచి లిఫ్ట్‌లో కిందకి వస్తున్నాడు. ఆ సమయంలో లిఫ్ట్ ఆగిపోయింది. దాంతో వరుణ్ లిఫ్ట్‌లో ఉన్న ఇంటర్‌కామ్ ద్వారా సెక్యూరిటీ గార్డుకు సమాచారం ఇచ్చాడు. సెక్యూరిటీ గార్డు లిఫ్ట్‌మ్యాన్‌ను తీసుకుని లిఫ్ట్ దగ్గరకు చేరుకున్నాడు. ఇద్దరూ ఐదు నిమిషాల పాటు ప్రయత్నించి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వరుణ్‌ని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. అయితే ఐదు నిమిషాలు ఆలస్యమైందనే కారణంతో వరుణ్.. లిఫ్ట్ నుంచి బయటకు రాగానే సెక్యూరిటీ గార్డును, లిఫ్ట్ మ్యాన్‌ను చెంపదెబ్బలు కొట్టాడు. 


తమను కాపాడిన వ్యక్తులకు ధన్యవాదాలు చెప్పవలసింది పోయి, కొట్టినందుకు సెక్యూరిటీ గార్డులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పని చేస్తున్న సెక్యూరిటీ గార్డులందరూ `వరణ్ నాథ్ డౌన్ డౌన్` అంటూ నినాదాలు చేశారు. సెక్యూరిటీ గార్డులంతా సమ్మెకు దిగి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో గురుగ్రామ్ పోలీసులు వరుణ్ నాథ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-08-30T21:21:05+05:30 IST