ఏఎస్సై ఉద్యోగం అన్నాడు.. ఎస్సై డ్రెస్ లో ఫోటో పంపాడు.. అనుమానం వచ్చిన అమ్మాయి ఆరా తీస్తే షాక్

ABN , First Publish Date - 2021-10-18T08:42:12+05:30 IST

ఏఎస్సై నంటూ అమ్మాయిని మోసగించి పెళ్లి చేసుకోబోయిన ఓ వ్యక్తిని ఇండోర్‌లోని విజయ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ..

ఏఎస్సై ఉద్యోగం అన్నాడు.. ఎస్సై డ్రెస్ లో ఫోటో పంపాడు.. అనుమానం వచ్చిన అమ్మాయి ఆరా తీస్తే షాక్

ఇండోర్: ఏఎస్సై నంటూ అమ్మాయిని మోసగించి పెళ్లి చేసుకోబోయిన ఓ వ్యక్తిని ఇండోర్‌లోని విజయ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రవి సోలంకి అలియాజ్ రాజీవర్ ఇండోర్‌లోని సిమ్‌రేల్‌ ప్రాంతంలో నివశిస్తుంటాడు. రవికి 2019 జూన్ 28న ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. యువతి బంధువుల ద్వారా ఈ సంబంధం కుదిరింది. తాను మధ్యప్రదేశ్ పోలీస్ ఏఎస్సై‌ నని రవి పెళ్లి కూతురు కుటుంబ సభ్యులను నమ్మించాడు. ఆ తర్వాత నిశ్చితార్థం వైభవంగా జరిగింది. 2022 మే 9న వివాహం జరిపించేందుకు పెద్దలు ముహూర్తం నిశ్చయించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత తాను స్టేషన్ కి వచ్చి కలుస్తానని ఆమె రవిని కోరింది. కానీ అతడు మాట దాటవేసేవాడు. తాను వేరే చోట ఉన్నానని చెప్పేవాడు. ప్రతిసారీ ఇదే మాట చెప్పేవాడు. 


ఇక కొద్దిరోజుల క్రితం రవి పోలీస్ డ్రెస్ లో ఉన్న తన ఫోటోను ఆమెకు పంపించాడు. ఈ ఫోటో చూసిన ఆమెకు ఆశ్చర్యపోయింది. ఈ ఫొటోలో రవి ఎస్సై డ్రెస్ లో ఉండడంతో ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే ఐటీ ప్రొఫెషనల్ గా పని చేస్తున్న తన తమ్ముడికి విషయం చెప్పి రూఖ్వి గురించి తెలుసుకోవాలని కోరింది. అతడు పోలీస్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా జిల్లాలోనే అలాంటి అధికారి ఎవరూ లేరని తేలింది.


తాను మోసపోయానని తెలిసిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ పోలీస్ అధికారేనని చెప్పేవారని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే మండపం బుక్ చేశామని, పెళ్లి పనులన్నీ మొదలు పెట్టేసామని, ఇప్పుడు పెళ్ళికొడుకు నకిలీ బండారం బయటపడడంతో షాక్ తగిలినట్లైందని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 


ఏ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీలుకున్నారు. నిందితుడు పని పాట లేకుండా తిరుగుతుంటాడని, ఊళ్ళో వాళ్ళందరినీ తక్అను పోలీస్ అని నమ్మిస్తున్నాడని వివరించారు.

Updated Date - 2021-10-18T08:42:12+05:30 IST