ఇద్దరి అవయవదానంతో.. 14 మందికి పునరుజ్జీవనం

ABN , First Publish Date - 2021-08-21T18:36:20+05:30 IST

వివిధ కారణాలతో మెదడు నిష్ర్కియంగా మారిన ఇరువురి కుటుంబీకులు చూపిన మానవత్వంతో ఏకంగా 14మంది వివిధ జబ్బులతో బాధపడుతున్న వారికి పునరుజ్జీవనం

ఇద్దరి అవయవదానంతో.. 14 మందికి పునరుజ్జీవనం

బెంగళూరు: వివిధ కారణాలతో మెదడు నిష్ర్కియంగా మారిన ఇరువురి కుటుంబీకులు చూపిన మానవత్వంతో ఏకంగా 14మంది వివిధ జబ్బులతో బాధపడుతున్న వారికి పునరుజ్జీవనం కలిగించినట్లు అయ్యింది. మైసూరులోని ఓ ప్రైవే టు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ బ్రెయిన్‌డెడ్‌ అయ్యారు. మైసూరు జిల్లా హుణసూరుకు చెందిన లారెన్స్‌(40) కొడుగు జిల్లా కుశాలనగర్‌కు చెందిన శోభా (48)ల నుంచి అవయవదానం సాధ్యమైంది. ఈనెల 16న రోడ్డు ప్రమాదంలో లారెన్స్‌ తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో బ్రెయి న్‌డెడ్‌గా డాక్టర్‌లు నిర్ధారించారు. అదే తరహాలోనే శోభాకు మెదడు ప్రాంతంలో రక్తస్రావం కావడంతో బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు ప్రకటించారు. ఇరుకుటుంబాలకు చెందిన వారు అవయవదానం చేసేందుకు మానవత్వంతో ముందుకొచ్చారు. ఇరువురి నుంచి 4 కిడ్నీలు, రెండు లివర్‌లు, నాలుగు హృదయ కవాటాలు, 4 కార్నియాలను ఇతరులకు అమర్చారు.


Updated Date - 2021-08-21T18:36:20+05:30 IST