ఫొటో దిగే యావలో పడి.. చారిత్రిక శిల్పాన్ని విరిచేశాడు!

ABN , First Publish Date - 2020-08-06T04:11:56+05:30 IST

ఫోటో దిగాలన్న ఓ వ్యక్తి ఉబలాటానికి రెండొందల ఏళ్ల నాటి శిల్పం బలైపోయింది. ఫోటో బాగా రావాలన్న ధ్యాసలో ఉన్న అతడు ఏకంగా దానికి వీపు ఆనుకుని కెమెరాకు ఫోజులివ్వడంతో శిల్పం కాలికున్న మూడువేళ్లు విరిగిపోయాయి.

ఫొటో దిగే యావలో పడి.. చారిత్రిక శిల్పాన్ని విరిచేశాడు!

ప్యారిస్: ఫోటో దిగాలన్న ఓ వ్యక్తి ఉబలాటానికి రెండొందల ఏళ్ల నాటి శిల్పం బలైపోయింది. ఫోటో బాగా రావాలన్న ధ్యాసలో ఉన్న అతడు ఏకంగా దానికి వీపు ఆనించి కెమెరాకు ఫోజులివ్వడంతో శిల్పం కాలికున్న మూడువేళ్లు విరిగిపోయాయి.  ఇంతటి ఘనకార్యానికి పూనుకున్న సదరు వ్యక్తి ఆస్ట్రేలియా పౌరుడు కాగా.. ఇటలీలోని ఆంటోనియో కనోవా మ్యూజియం ఈ దుర్ఘటనకు వేదిక అయింది. కొస మెరుపు ఏంటంటే.. ఇంత జరిగినా కూడా సదరు వ్యక్తి ఈ విషయాన్ని మ్యూజియం వారికి చెప్పలేదు. ఏంజరగనట్టు చాలా యాదాలపంగా.. సైలెంట్‌గా జంపైపోయాడు. ఆ తరువాత.. పోలీసులు అతడి జాడను కనుక్కున్నారు. మరోవైపు.. చేసిన నేరానికి అతడు తగిన శిక్ష అనుభవించకుండా సోంత దేశానికి తిరిగి వెళ్లనీయద్దంటూ మ్యూజియం అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం విషయం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో.. అతడికి శిక్ష విధించాలా వద్దా అనే అంశాన్ని న్యాయస్థానం పరిశీలిస్తోంది. అయితే జరిగిన తప్పుకు సదరు విదేశస్తుడు ఎంతో పశ్చాత్తాపపడుతున్నాడని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-08-06T04:11:56+05:30 IST