మహిళా రూమ్‌మేట్ కావాలంటూనే వింత కండీషన్లు.. నెట్టింట వైరల్ అవుతున్న 44 ఏళ్ల వ్యక్తి ప్రకటన..

ABN , First Publish Date - 2022-04-25T22:09:24+05:30 IST

మనతో పాటు ఒకే ఇంట్లో నివసించే వ్యక్తి అభిరుచులు, అలవాట్లు మనలాగే ఉండాలని కోరుకుంటాం.

మహిళా రూమ్‌మేట్ కావాలంటూనే వింత కండీషన్లు.. నెట్టింట వైరల్ అవుతున్న 44 ఏళ్ల వ్యక్తి ప్రకటన..

మనతో పాటు ఒకే ఇంట్లో నివసించే వ్యక్తి అభిరుచులు, అలవాట్లు మనలాగే ఉండాలని కోరుకుంటాం. అలాంటి వ్యక్తితోనే స్నేహం చేస్తాం. నగరాలకు చదువు కోసం, ఉద్యోగాల కోసం వెళ్లే యువతీ యువకులు అక్కడ అద్దెలు భరించలేక రూమ్ షేరింగ్ కోసం ప్రయత్నిస్తుంటారు. స్నేహితులతో కలిసి ఇళ్లు అద్దెకు తీసుకుంటారు. బ్రిటన్‌కు చెందిన ఓ 44 ఏళ్ల పురుషుడు కూడా అలాగే ఇల్లు షేర్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తనకు మహిళా రూమ్మేట్ కావాలని, అయితే ఆమె కొన్ని కండిషన్స్‌కు ఒప్పుకోవాలని షరతు పెట్టాడు. 


తన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో తనతో పాటు ఉండబోయే మహిళ రూమ్మేట్ వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలని, తనతో పాటు బెడ్రూమ్ కూడా షేర్ చేసుకోవచ్చని చెప్పాడు. అయితే తన ఫ్లాట్‌లో డ్రగ్స్, ఆల్కహాల్ సేవించడం నిషేధమని, పెంపుడు జంతువులు కూడా ఉండకూడదని చెప్పాడు. వీటితో పాటు ఇంటి తలుపులు, బాత్రూమ్ తలుపులు ఎప్పుడూ లాక్ చేసి ఉండకూడదని వింత కండిషన్ కూడా పెట్టాడు. తన ప్రకటనను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఇతని ప్రకటన చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-04-25T22:09:24+05:30 IST