పందికోసం కోర్టులో కేసు.. నా పంది నా ఇష్టమంటూ అధికారులపై ఎదరుతిరిగిన ఓనర్

ABN , First Publish Date - 2022-02-13T08:46:12+05:30 IST

సాధారణంగా మనుషులు ఇళ్లలో కుక్కలు, పిల్లులు, చిలుకలు వంటి జంతువులను పెంచుతుంటారు. కానీ ఒక వ్యక్తి తన ఇంట్లో పందిని పెంచుకుంటున్నాడు. అది కూడా సాధారణంగా కాదు. దాన్ని ముద్దుగా..

పందికోసం కోర్టులో కేసు.. నా పంది నా ఇష్టమంటూ అధికారులపై ఎదరుతిరిగిన ఓనర్

సాధారణంగా మనుషులు ఇళ్లలో కుక్కలు, పిల్లులు, చిలుకలు వంటి జంతువులను పెంచుతుంటారు. కానీ ఒక వ్యక్తి తన ఇంట్లో పందిని పెంచుకుంటున్నాడు. అది కూడా సాధారణంగా కాదు. దాన్ని ముద్దుగా.. సకల ఐశ్వర్యాలతో బుజ్జగిస్తూ ఇంట్లోనే పెట్టుకున్నాడు. దాని కోసం ఒక ప్రత్యేక గది కట్టించి.. అందులో దాని కోసం ఒక బెడ్డు కూడా పెట్టాడు. కానీ పందులను అలా పెంచకూడదని అతనికి స్థానికంగా అధికారులు ఆదేశించారు. 


పందులను ఇంటి లోపల కాదు. ఫామ్ హౌస్‌లో పెంచుకోవాలని అధికారులు ఆ వ్యక్తిని ఆదేశించారు. కానీ ఆ వ్యక్తి తన పంది తన నేస్తమని.. దానిని వదిలేది లేదని అధికారులకు ఎదురుతిరిగాడు. వారిపై కోర్టులో కేసు వేశాడు. 


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కెనాజోహరీలో ప్రాంతంలో ఫ్లాట్‌ అనే వ్యక్తి 110 పౌండ్లు బరువు ఉన్న ఓ పందిని పెంచుకుంటున్నాడు. దానికి ముద్దుగా ‘ఎల్లి’ అనే పేరు పెట్టాడు. ఆ పందిని తన నేస్తంగా భావించి.. దానితో తన మనసులో ఉన్న సుఖ దుఖాలను చెబుతుంటాడు. ఇంట్లో ఆ పందికి ప్రత్యేకంగా ఓ రూమ్ కూడా ఏర్పాటు చేశాడు. ఆ రూమ్‌లో పడుకోవడానికి దాని కోసం ఓ పరుపు కూడా సమకూర్చాడు. దానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడు.


ఇదిలా ఉండగా ప్లాట్ ఒక పందిని ఇంట్లో పెంచుకోవటంపై స్థానిక అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పందిని ఇంట్లో పెంచుకోవడం కుదరదని, అది ఫామ్‌ జంతువని, అందువల్ల దాన్ని ఫామ్‌హౌస్‌లో లేదా అడవిలో వదిలేయాలని ఫ్లాట్‌కు సూచించారు.


కానీ నా పందిని వదులుకునేదే లేదని ప్లాట్ తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు పందిని ఇంట్లో పెంచితే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఫ్లాట్‌ అధికారులపై క్రిమినల్‌ కేసు వేశాడు.  ఎల్లి(పంది) తనను కష్ట సమయాల్లో ఓదార్చిందని.. ఆ పంది కుక్కల కన్నా ఎంతో తెలివైందని, దాన్ని వదులుకోనని కోర్టుకు చెప్పాడు. 'నాకు న్యాయం చేయండీ..నా పందిని నా నుంచి దూరం చేయవద్దు' అని కోర్టులో న్యాయమూర్తిని వేడుకున్నాడు. ప్లాట్ వేసిన పెంపుడు పంది కేసు ఇంకా కోర్టు విచారణలో ఉంది. 

Updated Date - 2022-02-13T08:46:12+05:30 IST