మా అబ్బాయిని కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రుల ఫిర్యాదు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజం

ABN , First Publish Date - 2021-12-02T06:08:32+05:30 IST

వివాహం అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టంలేనప్పుడు చాలా మంది వారిని ఎదిరించలేక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటి ఒక కేసులో తల్లిదండ్రులు నిశ్చయించిన పెళ్లి ఇష్టం లేక ఒక వ్యక్తి కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన వాడు తిరిగి రాకపోయేసరికి ఇంట్లో వారంతా 'కోపం తగ్గితే వస్తాడులే'.. అని అనుకున్నారు. కానీ మరుసటి రోజు అతను కిడ్నాప్ చేయబడినట్లు వచ్చింది...

మా అబ్బాయిని కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రుల ఫిర్యాదు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజం

వివాహం అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టంలేనప్పుడు చాలా మంది వారిని ఎదిరించలేక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటి ఒక కేసులో తల్లిదండ్రులు నిశ్చయించిన పెళ్లి ఇష్టం లేక ఒక వ్యక్తి కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన వాడు తిరిగి రాకపోయేసరికి ఇంట్లో వారంతా 'కోపం తగ్గితే వస్తాడులే'.. అని అనుకున్నారు. కానీ మరుసటి రోజు అతను కిడ్నాప్ చేయబడినట్లు వచ్చింది. దీంతో ఆందోళన చెందిన అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణ చేయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.


పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని బుందీ జిల్లాకు చెందిన సురేశ్ కుమార్(22) పెద్దలు నిశ్చయించిన పెళ్లి ఇష్టంలేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు సురేశ్ ఫోన్ చేసి తనను ఎవరో కళ్లకు గంతలు కట్టి కిడ్నాప్ చేశారని.. వారంతా తనని కొడుతున్నారని చెప్పాడు. ఆ తరువాత వెంటనే అతని ఫోన్ స్విచాఫ్ అయిపోయింది. సురేశ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పోలీసుల బృందం వెంటనే సురేశ్ కోసం గాలింపులు మొదలుపెట్టింది. మూడు రోజుల తరువాత పోలీసులు సురేశ్ చివరి కాల్ లొకేషన్ ఆధారంగా వెతుకుతుండగా.. అతను ఇంటి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పాత బడిన గుడిలో దొరికాడు. పోలీసులు అతడిని ప్రశ్నించగా.. ముందుగా కిడ్నాప్ గురించి చెప్పాడు. కిడ్నాప్ చేసిన దుండగులు ముఖం కప్పుకొని ఉన్నారని చెప్పాడు. ఆ తరువాత పోలీసులు పలుమార్లు కిడ్నాప్ జరిగిన విధానం గురించి అడిగారు. దానికి సురేశ్ చెప్పిన సమాధానాలు ముందు వెనుక కావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసుల సురేశ్‌తో నిజం చెప్పించారు. 


ఇంట్లో పెద్దలు కుదిర్చిన వివాహం తనకు ఇష్టం లేదని అందుకే మరో రెండు రోజుల్లో ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం ఉండగా.. ఇల్లు వదిలి వెళ్లిపోయానని చెప్పాడు. ఆ మూడు రోజులు ఊరి చివర ఉన్న అడవిలో గడిపానని.. రాత్రి వేళ గుడిలో నిద్రపోయానని సురేశ్ అన్నాడు. 


Updated Date - 2021-12-02T06:08:32+05:30 IST