Abn logo
Jan 27 2021 @ 00:48AM

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

తాటిచెట్లపాలెం, జనవరి 26 : భార్యతో మనస్పర్థల కారణంగా మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గండిబోయిన భాస్కరరావు(45) అనే వ్యక్తి హెచ్‌పీసీఎల్‌లో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. భార్య సూర్యకుమారితో గొడవలు ఉండడంతో ఇద్దరు కుమారులతో కలిసి మురళీనగర్‌లో వేరుగా ఉంటున్నాడు. కాగా సోమవారం అర్ధరాత్రి వేళ ఇంట్లో అతను వాంతులు చేసుకోవడంతో స్థానికుల సహాయంతో కుమారులు కేజీహెచ్‌కి తరలించారు. అయితే అతను పురుగుల మందు తాగినట్టు వైద్యులు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం అతను మృతి చెందాడు. కంచరపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement