Viral Video: బర్త్ డే రోజు తండ్రికి స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కొడుకు.. మనుసును కట్టేపడేస్తున్న ఎమోషనల్ వీడియో!

ABN , First Publish Date - 2022-10-14T23:56:30+05:30 IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Viral Video: బర్త్ డే రోజు తండ్రికి స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కొడుకు.. మనుసును కట్టేపడేస్తున్న ఎమోషనల్ వీడియో!

ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని భావోద్వేగపూరిత వీడియోలు మనసును కదిలించేస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో తండ్రీకొడుకుల ప్రేమను కళ్లకు కట్టినట్టు చూపెడుతోంది. ఆ వీడియో నెటిజన్ల మనసులను దోచుకుంటోంది. ఒక వ్యక్తి తన కొడుకు ఇచ్చిన పుట్టినరోజు బహుమతికి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 


తాజాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుల మధ్య ఓ హోటళ్లో పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఇంతలో ఆ వ్యక్తి కొడుకు నేరుగా తండ్రి ఎదురుగా వెళ్లి నిలబడ్డాడు. విదేశాల్లో ఉండాల్సిన కొడుకు తన ఎదురుగా నిలబడ్డంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొడుకును గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. 

Updated Date - 2022-10-14T23:56:30+05:30 IST