ఒక్కో వలస కార్మికుడికి పదివేలు ఇవ్వండి : మమత డిమాండ్

ABN , First Publish Date - 2020-06-03T19:44:43+05:30 IST

కోవిడ్, లాక్‌డౌన్ నేపథ్యంలో ఒక్కో వలస కార్మికుడికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆ

ఒక్కో వలస కార్మికుడికి పదివేలు ఇవ్వండి : మమత డిమాండ్

కోల్‌కతా : కోవిడ్, లాక్‌డౌన్ నేపథ్యంలో ఒక్కో వలస కార్మికుడికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆ డబ్బును నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోనే వేయాలని పేర్కొన్నారు. వీరితో పాటు అసంఘటిత కార్మికులకు కూడా తగినంత ఆర్థిక సహాయం చేయాలంటూ ఆమె బుధవారం ట్వీట్ చేశారు.


ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వారందరూ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, పీఎం కేర్స్ ద్వారా వారందర్నీ ఆదుకోవాలని కేంద్రానికి సూచించారు. ‘‘ఆంఫన్ కారణంగా దెబ్బతిన్న మా పశ్చిమ బెంగాల్ ఇళ్లను మరమత్తులు చేసుకోడానికి 5 లక్షల మందికి తగిన సహాయం చేశాం. పంటలు దెబ్బతిన్న వారి దాదాపు 23 లక్షల మందికి తగిన ఆర్థిక సాయం అందించాం. ఇప్పటి వరకూ 1444 కోట్లను విడుదల చేశాం.’’ అని ఆమె పేర్కొన్నారు.


అయితే మమతా బెనర్జీ డిమాండ్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదరంశి రాహుల్ సిన్హా స్పందించారు. వివిధ రాష్ట్రాల నుంచి బెంగాలీ కార్మికులను తీసుకురావడంలో ఆమె ఘోరంగా విఫలం చెందారని, దాని నుంచి దృష్టి మరల్చడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. బెంగాల్‌కు శ్రామిక్ రైళ్లను పంపడంలో కేంద్రం సిద్ధంగానే ఉందని, చాలా సార్లు స్పందించామని, అయితే మమత ఉదాసీనత కారణంగా అది అనుకున్న రీతిలో సాధ్యం కాలేదని, అందుకే ఆమెపై కార్మికులు కోపంతో ఉన్నారని రాహుల్ సిన్హా తెలిపారు. 

Updated Date - 2020-06-03T19:44:43+05:30 IST