కూచ్‌బెహర్ దోషులను శిక్షించాల్సిందే: మమత

ABN , First Publish Date - 2021-04-14T20:08:39+05:30 IST

కూచెబెహర్ కాల్పులకు పాల్పడిన దోషులు ఎవరైనప్పటికీ వారిని కఠినంగా శిక్షించాలని..

కూచ్‌బెహర్ దోషులను శిక్షించాల్సిందే: మమత

కూచ్‌బెహర్: కూచెబెహర్ కాల్పులకు పాల్పడిన దోషులు ఎవరైనప్పటికీ వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కేంద్ర బలగాల కాల్పుల్లో మృతి చెందిన కుటుంబ సభ్యులను మమతా బెనర్జీ బుధవారంనాడు కలుసుకున్నారు. కాల్పుల దోషులు ఎంత పెద్దవాళ్లయినా వారికి శిక్ష పడాలని, న్యాయం జరగాలని అన్నారు. కాల్పుల్లో మృతుల కుటుంబాలకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.



'నన్ను మీ ఇంటి ఆడకూతురుగా భావించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజాస్వామ హంతకుల మీద ప్రజాస్వామ్య పరిక్షకులు విజయం సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను' అని మమత పేర్కొన్నారు.


దీదీ న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది..

బలగాల కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి చెందిన ఒకరు మాట్లాడుతూ, దీదీ పిలుపు మీద తాము ఇక్కడకు వచ్చామని, ఎన్నికలు పూర్తికాగానే సాధ్యమైనంత త్వరగా సహాయం చేస్తామని మమత భరోసారి ఇచ్చారని చెప్పారు. అయితే, హంతకులను శిక్షించాలన్నదే తమ ప్రధానమైన డిమాండ్ అని మృతుని సోదరుడు మంజూర్ అలి మియ అన్నారు.

Updated Date - 2021-04-14T20:08:39+05:30 IST