బయటకు కనిపిస్తున్న ఎముకలు.. ఏడేళ్ల వయసున్న ఈ బాలిక బరువు కేవలం 7 కేజీలే.. తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోతే..

ABN , First Publish Date - 2022-09-07T21:04:10+05:30 IST

ఆ బాలిక వయసు ఏడేళ్లు.. ఆ బాలిక బాలిక బరువు ఏడు కిలోలు.. అవును.. నిజమే ఏడేళ్ల ఆ బాలిక బరువు కేవలం ఏడు కిలోలు మాత్రమే.

బయటకు కనిపిస్తున్న ఎముకలు.. ఏడేళ్ల వయసున్న ఈ బాలిక బరువు కేవలం 7 కేజీలే.. తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోతే..

ఆ బాలిక వయసు ఏడేళ్లు.. ఆ బాలిక బాలిక బరువు ఏడు కిలోలు.. అవును.. నిజమే ఏడేళ్ల ఆ బాలిక బరువు కేవలం ఏడు కిలోలు మాత్రమే.. అంతేకాదు బాలికకు చిన్నప్పటి నుంచి మధుమేహం కూడా ఉంది. ఆ బిడ్డను తల్లిదండ్రులు వదిలేశారు.. ఆ బాలిక దయనీయ స్థితి చూసీ సీఎం కూడా చలించిపోయారు.. ప్రభుత్వ విచారణలో సీడీపీఓ, సూపర్‌వైజర్‌, అంగన్‌వాడీ కార్యకర్తల నిర్లక్ష్యం బయటపడింది. వారందరినీ వెంటనే విధుల నుంచి తొలగించారు. మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని సత్నా జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. 


ఇది కూడా చదవండి..

Viral Video: వెయిటర్‌ ట్యాలెంట్‌కు నెటిజన్ల ఫిదా.. జీతం పెంచాల్సిందే అంటూ కామెంట్లు..


సత్నా జిల్లాలోని చిత్రకూట్ తాలూకాకు చెందిన ఆ బాలిక పేరు సోమావతి. ఆమె కడుపులో ఉండగానే తల్లిని తండ్రి వదిలేశాడు. పుట్టిన ఏడాదికే ఆ బాలికను వదిలేసి తల్లి వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో తండ్రి మేనత్త ఆ బాలికను సంరక్షించింది. అయితే ఆమె నిరుపేద కావడంతో ఆ బాలికకు పౌష్టికాహరం అందించలేకపోయింది. పైగా ఆ బాలిక టైప్-1 డయాబెటిక్ పేషెంట్. అంగన్‌వాడీ కార్యకర్తలు ఆ బాలిక పేరును నమోదు చేసుకోకపోవడం వల్ల ఆమెకు పౌష్టికాహారం లభించలేదు. ఏడేళ్ల సోమావతి బరువు 22 కిలోలు ఉండాలి. ఇక, ఆమె బలహీనమైన శరీరంపై మధుమేహం దాడి చేసింది. టెస్ట్ చేయగా ఆమె షుగర్ లెవెల్స్ ఏకంగా 755 మి.గ్రా. ఉన్నాయి.  ఒక సాధారణ వ్యక్తికి గరిష్టంగా 200 మి.గ్రా. మించి షుగర్ లెవల్స్ ఉండకూడదు. 


ఎముకలు బయటకు కనిపించేలా అత్యంత దయనీయ స్థితిలో ఉన్న సోమావతి గురించి మధ్యప్రదేశ్ సీఎంకు తెలిసింది. దీంతో వెంటనే ఆయన విచారణకు ఆదేశించారు. సోమావతిలో పోషకాహార లోపాన్ని తొలగించలేకపోవడం అంగన్‌వాడీ వ్యవస్థ వైఫల్యానికి కారణమైంది. దీంతో సంబంధిత అధికారులను సీఎం సస్పెండ్ చేశారు. త్వరితగతిన ఆ బాలికకు వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మార్చాలని ఆదేశించారు.

Updated Date - 2022-09-07T21:04:10+05:30 IST