Abn logo
Apr 11 2021 @ 12:48PM

‘రాహుల్‌ అంటే బీజేపీ నేతలకు వణుకు’


బెంగళూరు: బీజేపీ నేతులు రాహుల్‌గాంధీ అంటే వణుకుతారని అందుకే తరచూ అతడి పేరు వాడుతారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. బెళగావి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీకి ఏమీ తెలియదని చెప్పే బీజేపీ నేతలు పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో అతడి పేరు లేకుండా బహిరంగ సభలు జరిగాయా..? అంటూ ప్రశ్నించారు. రా హుల్‌ భవిష్యత్తులో దేశంలో మహానాయకుడు అవుతాడన్నారు. రాహుల్‌ మనోధైర్యం కోల్పోయేలా పదే పదే ఆరోపణలు చేస్తుంటారన్నారు. దేశ ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షాలకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. శనివారం వివిధ ప్రాంతాలలో ఖర్గే ఎన్నికల ప్రచారం చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, నాయకులు సలీం అహ్మద్‌, రామలింగారెడ్డి, ఎంబీ పాటిల్‌, దేశ్‌పాండే పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement