Minister మల్లారెడ్డిపై మల్కాజిగిరి DCC అధ్యక్షుడి కామెంట్స్

ABN , First Publish Date - 2022-05-24T22:53:22+05:30 IST

తెలంగాణ మంత్రి మల్లారెడ్డిని మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ విమర్శించారు. రూల్స్‌కి విరుద్ధంగా కాలేజీలు నడుపుతున్నాడని, నిబంధనలకు విరుద్ధంగా జవహర్

Minister మల్లారెడ్డిపై మల్కాజిగిరి DCC అధ్యక్షుడి కామెంట్స్

Telangana : తెలంగాణ మంత్రి మల్లారెడ్డిని మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ విమర్శించారు. రూల్స్‌కి విరుద్ధంగా కాలేజీలు నడుపుతున్నాడని, నిబంధనలకు విరుద్ధంగా జవహర్ నగర్‌లో ఆసుపత్రి నిర్మించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని అరేయ్.. తురేయ్.. అంటూ తప్పుడు  వ్యాఖ్యలు చేస్తే మేడ్చల్‌లో తిరగనివ్వమని హెచ్చరించారు. పార్టీ అధికార ప్రతినిధి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. డబ్బులు ఇస్తేనే మల్లారెడ్డికి మంత్రి పదవి వచ్చిందని ఆరోపించారు. తన కాలేజీలో ఒక్క పేద విద్యార్థిని అయిన చదివించాడా? అని ప్రశ్నించారు. 

Updated Date - 2022-05-24T22:53:22+05:30 IST