డైనోసార్!
ABN , First Publish Date - 2021-04-21T05:30:00+05:30 IST
ముందుగా క్రీమ్ కలర్ ఫోమ్ షీట్‌పై డైనోసార్ అవుట్‌లైన్ గీసి, కత్తిరించాలి. ఆకుపచ్చ ఫోమ్ షీట్ తీసుకుని దీర్ఘచతురస్రాకారంలో రెండు అంగుళాల పొడవుండేలా ఐదు స్ట్రిప్‌లు కత్తిరించుకోవాలి. ఒకటి తోక కోసం మొనదేలి ఉండేలా కట్ చేసుకోవాలి...
కావలసినవి: ఆరెంజ్ ఫోమ్ షీట్ - ఒకటి, ఆకుపచ్చ ఫోమ్ షీట్ - ఒకటి, క్రీమ్‌కలర్ ఫోమ్ షీట్ - ఒకటి, కత్తెర, జిగురు, గూగ్లీ కళ్లు.
ఇలా చేయాలి... ముందుగా క్రీమ్ కలర్ ఫోమ్ షీట్‌పై డైనోసార్ అవుట్‌లైన్ గీసి, కత్తిరించాలి. ఆకుపచ్చ ఫోమ్ షీట్ తీసుకుని దీర్ఘచతురస్రాకారంలో రెండు అంగుళాల పొడవుండేలా ఐదు స్ట్రిప్‌లు కత్తిరించుకోవాలి. ఒకటి తోక కోసం మొనదేలి ఉండేలా కట్ చేసుకోవాలి.
ఆరెంజ్ షీట్ తీసుకుని త్రిభుజాకారంలో చిన్న చిన్న స్ట్రిప్‌లు కత్తిరించాలి. తల కోసం పియర్ షేప్‌లో ఒకటి కత్తిరించుకోవాలి. ఇప్పుడు ఆకుపచ్చ షీట్స్ జిగురు సహాయంతో బొమ్మలో చూపించిన విధంగా కాళ్లు, మెడ, తోక అతికించాలి. ఆరెంజ్ షీట్ ముక్కలను వీపు భాగంలో అంటించాలి. చివరగా గూగ్లీ కళ్లను అంటిస్తే డైనోసార్ బొమ్మ రెడీ.