మహిళా సంఘాలతోనే మాస్క్‌ల తయారీ : డీఆర్‌డీఓ

ABN , First Publish Date - 2020-04-10T10:54:15+05:30 IST

కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా జిల్లాలోని 31మండలాల పరిధిలోని 845గ్రామ పంచాయతీల్లో మహిళా

మహిళా సంఘాలతోనే మాస్క్‌ల తయారీ : డీఆర్‌డీఓ

నల్లగొండ టౌన్‌, ఏప్రిల్‌9 : కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా జిల్లాలోని 31మండలాల పరిధిలోని 845గ్రామ పంచాయతీల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మాస్క్‌ల తయారీ నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మండల, గ్రామ స్థాయి సిబ్బంది మాస్క్‌లపై మహిళా సంఘ సభ్యులు, రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.


మాస్క్‌ల తయారీకి సంబంధించి అవసరమయ్యే క్లాత్‌ను డీఆర్‌డీఓ మహిళా సంఘాల సభ్యులకు గురువారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,142 సంఘబంధాలతో 1,710మంది టైలర్లను గుర్తించి వారికి మాస్క్‌ల తయారీలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేం ద్రం వద్ద కమిటీ సభ్యులు ఈ మాస్క్‌లను ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. సర్పంచ్‌లు ఎవరైన దాతలను గుర్తించి వారితో కొనుగోలు చేసి మాస్క్‌లను పేద, నిరుపేదలకు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. 

Updated Date - 2020-04-10T10:54:15+05:30 IST