Advertisement
Advertisement
Abn logo
Advertisement

కారుణ్య నియామకాలు చేపట్టండి

ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

కడప(ఎడ్యుకేషన్‌), నవంబరు 27 : కొవిడ్‌తో మరణించిన ఉపాధ్యాయ, ఉద్యోగుల కుటుంబంలోని ఒకరికి నిబంధనలను సవరించి కారుణ్య నియామకాలు ఇవ్వడానికి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు. అమరావతిలోని సచివాలయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 30వ తేదీలోపు కారుణ్య నియామకాలు ఇవ్వడానికి సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని వారి దృష్టికి తీసుకొని వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలను సవరించి అన్ని శాఖలను కలెక్టర్‌ పరిధిలోకి తీసుకొనివచ్చి ఖాళీలు భర్తీ చేయాలని, ఖాళీలు లేనప్పుడు సూపర్‌న్యూమరీ పోస్టులో నియమించాలని కోరినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్‌ 72, 73, 74 అమలు, మోడల్‌ స్కూల్స్‌ టీచర్లకు 010 హెడ్‌ ద్వారా వేతనాల చెల్లింపు, బీజీబీవీ, ఎస్‌ఎ్‌సఏ టీచర్లు, సిబ్బందికి మినిమం టైం స్కేల్‌ వర్తింపు, పాలిటెక్నిక్‌ ఆధ్యాపకుల 7వ వేతన స్కేలు, కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు నష్టం కలగకుండా చూడాలని మున్సిపల్‌ టీచర్ల పీఎఫ్‌ ఖాతాలు ప్రారంభానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. 

Advertisement
Advertisement