రక్త దానం అలవాటుగా మార్చుకోవాలి

ABN , First Publish Date - 2022-08-18T05:26:25+05:30 IST

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకోవాలని కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ పిలు పునిచ్చారు.

రక్త దానం అలవాటుగా మార్చుకోవాలి
రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ 

పెద్దపల్లి టౌన్‌, ఆగస్టు 17 : ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకోవాలని కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ పిలు పునిచ్చారు. స్వాంతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎందరో మృత్యు వాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 75మంది రక్తదాతలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామ న్నారు. బ్లడ్‌ బ్యాంక్‌ సామర్థ్యానికి అనుగుణంగా రక్తం సేకరిస్తున్న ట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రిలో 84 మంది గోదావరిఖ నిలో 71 మంది, మంథని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో 60 మంది రక్తదానం చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా వైద్య అధికా రి ప్రమోద్‌ కుమార్‌, డీసీహెచ్‌ మందల వాసుదేవారెడ్డి, ఆదిరెడ్డి, రోడ్డు రవాణా శాఖ అధికారి రంగారావు తదితరులున్నారు. 

Updated Date - 2022-08-18T05:26:25+05:30 IST