నయనానందకరం మకరజ్యోతి దర్శనం

ABN , First Publish Date - 2021-01-16T05:23:41+05:30 IST

అయ్యప్పస్వామి ప్రతిరూపంగా భావించే మకరజ్యోతి దర్శనం గురువారం రాత్రి ఒంగోలు నగరం కొత్తపట్నం బస్టాండులోని శ్రీఅప్పయ్య స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

నయనానందకరం మకరజ్యోతి దర్శనం
అద్దంకిలో మకరజ్యోతిని దర్శించుకుంటున్న భక్తులు

ఒంగోలు(కల్చరల్‌), జనవరి 15: అయ్యప్పస్వామి ప్రతిరూపంగా భావించే మకరజ్యోతి దర్శనం గురువారం రాత్రి ఒంగోలు నగరం కొత్తపట్నం బస్టాండులోని శ్రీఅప్పయ్య స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు ఓరుగంటి సుబ్బరాయశాస్ర్తి అశేష భక్తుల మధ్య జ్యోతిని వెలిగించి శరణుఘోష చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు కాళె వెంకటేశ్వర్లు, నాళం గోవర్థన్‌, పువ్వాడ సురేష్‌, బీకే.బాబు, రాధ య్య, యరమాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

అద్దంకి: శింగరకొండ అయ్య్యప్పస్వామి దేవాలయం వద్ద ఏర్పాటుచే సిన మకరజ్యోతి దర్శనంకు భక్తులు అ ధిక సంఖ్యలో తరలివచ్చారు. దేవాలయం వద్ద భక్తులు తిలకించేలా అద్దంకి  కొండపై జ్యోతిని ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, పరుచూరి శ్రీనివాసరావు, సందిరెడ్డి శ్రీనివాసరావు, తిరుపతిరెడ్డి గురుస్వామి, బాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:23:41+05:30 IST