మాక్ అసెంబ్లీ విజయవంతం
విజయవాడ సిటీ, జనవరి 27: బహుజనులకు రాజ్యాధికారం సాధించే దిశగా కృషి చేస్తున్న ఫూలే, అంబేడ్కర్ రాజ్యాధికార సమితి స్థానిక బసవపున్నయ్య భవన్‌లో నిర్వహించిన రెండవ మాక్ అసెంబ్లీ విజయవంతమైంది. బహుజన నాయకులు రిప్రజెంటేటివ్ గవర్నర్‌గా, రిప్రజెంటేటివ్ సీఎంగా, రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేలుగా, రిప్రజెంటేటివ్ ఎమ్మెల్సీలుగా చట్ట సభల్లో బహుజన సమస్యలపై ఎలా పోరాడాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. బహుజనుల సమస్యలు, వాటికి పరిష్కారాలు, రాజ్యాధికారం సాధించేందుకు బహుజనులు ఏం చేయాలో మాక్ అసెంబ్లీలో పాల్గొన్న బహుజన నాయకులు బిల్లుల రూపంలో ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేసుకున్నారు.