మక్కలకు మోక్షం

ABN , First Publish Date - 2020-10-31T06:26:15+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లకు అఽధికారులు చర్యలు చేపడుతున్నారు. తొలుత మొక్కజొన్న కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఉ మ్మడి జిల్లా రైతులు ఆందోళనబాటిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం

మక్కలకు మోక్షం

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో  1.15 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు

రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం

63 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారుల నిర్ణయం

మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో రూ.1,850ల మద్దతు ధరకే కొనుగోళ్లు


కామారెడ్డి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లకు అఽధికారులు చర్యలు చేపడుతున్నారు. తొలుత మొక్కజొన్న కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఉ మ్మడి జిల్లా రైతులు ఆందోళనబాటిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులు పండించి న మొక్కజొన్నలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో మక్కల కొనుగోలుకు అ ధికారులు సన్నద్ధమవుతున్నారు. ఉభయ జిల్లాల్లో ఏ ప్రాం తంలో ఎక్కువ మొత్తంలో రైతులు మొక్కజొన్నలు పండిం చారు? ఎంతమేర దిగుబడి వస్తుంది? ఎన్ని కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయాలి? అనే అంశంపై సర్వే చేపట్టి రెం డు జిల్లాల్లో 63 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పెద్దమొత్తంలో మక్కలు వస్తే మరిన్ని కేం ద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.


2 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుడి అంచనా

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో అన్నదాతలు మొక్క జొన్నను లక్షల ఎకరాలలో సాగుచేస్తుంటారు. నిజామాబాద్‌ జిల్లాలో అంతరపంటగా సాగుచేస్తారు. ఈ ఏడాది వానాకా లంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 80 వేల ఎకరాలలో పం టను సాగుచేశారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 33 వేల ఎక రాలలో సాగైంది. దీంతో రెండు జిల్లాల్లో కలిపి సుమారు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అం చనా వేశారు. అయితే, ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం నిర్ణయి ంచిన మద్దతు ధరకు మార్క్‌ఫెడ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేపడుతూ వస్తోంది. గత ఏడాది కూడా కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి మక్కలను కొ నుగోలు చేశారు. అయితే, ఈ సారి నియంత్రిత సాగు విధా నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నను ఎక్కువ మొత్తంలో సాగు చేయొద్దని సూచించింది. అందులో భాగం గానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. అయితే, రైతులు ఆందోళనబాట పట్టడంతో సర్కారు దిగొచ్చి ఈ వా నాకాలం సీజన్‌లోనూ మక్కల కొనుగోలుకు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఉభయ జిల్లాల్లో ఆయా శాఖ ల అధికారులు రైతుల నుంచి మక్కలు కొనుగోలుకు ఏర్పా ట్లు చేస్తున్నారు.


63 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాలలో నే మక్కలు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం తో.. అధికారులు మక్కపంట రెండు జిల్లాల్లో ఏ ప్రాంతంలో ఇంతమేర సాగైంది? ఎంత దిగుబడి వస్తుంది? ఎక్కడెక్కడ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దానిపై సర్వే చేపట్టారు. మొ త్తమ్మీద రెండు జిల్లాల్లో 63 కేంద్రాలు (నిజామాబాద్‌ జిల్లా లో 28, కామారెడ్డి జిల్లాలో 35) ఏర్పాటు చేసేందుకు నిర్ణ యించి ప్రభుత్వానికి, మార్క్‌ఫెడ్‌ అధికారులకు నివేదిక పం పించారు. మార్క్‌ఫెడ్‌ సంస్థలో సరిపడా సిబ్బంది లేకపోవ డంతో సింగిల్‌ విండోల్లోనూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కామారెడ్డి జిల్లాలో శనివారం ను ంచి కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. కామారెడ్డి, భిక్కనూ రు, మాచారెడ్డిలో మొదట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మార్క్‌ఫెడ్‌ అధికారులు పేర్కొంటున్నారు.


రూ.1,850 మద్దతు ధర

మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం క్వింటాల్‌ మక్కల ను రూ.1,850కు కొనుగోలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలుత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కొందరు రైతులు ఇప్పటికే పంటను దళారులకు అమ్ముకు న్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడంతో మిగిలిన రైతులకు ఊరట లభించినట్లయి ంది. అయితే. ఈ సీజన్‌కు మాత్రమే ప్రభుత్వం మక్కలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. 


కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాం..రంజిత్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ డీఎం, కామారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం నుంచి మక్కలను కొనుగోలు చేయాలని  ఆదేశాలు వచ్చాయి. దీంతో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాం. మార్కెట్‌లోకి మక్కలు ఎన్నివచ్చినా కొనుగోలు చేస్తాం. శని వారం నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. కేం ద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం క్వింటాల్‌ మక్కలను రూ.1,850కి కొనుగోలు చేస్తాం.

Updated Date - 2020-10-31T06:26:15+05:30 IST