మహిళలకు కుట్టుమిషన్‌లు అందజేసిన రోటరీ వెస్ట్ క్లబ్ సభ్యులు
గూడూరురూరల్, మార్చి 2: ప్రజాసేవలో రోటరీవెస్ట్‌క్లబ్ ముందంజలో ఉంటుందని క్లబ్ సీనియర్ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక డీఎన్‌ఆర్ కమ్యూనిటీహలులో రోటరీవెస్ట్‌క్లబ్ ఆధ్వర్యంలో 10 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్ధికాభివృద్ధి సాఽధించాలన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు తాళ్లూరు శ్రీనివాసులు, బుజిగేంద్రరావు, శ్రీకంఠి రామ్మోహన్‌రావు, శ్రీకాంత్‌రెడ్డి, వాసుగౌడ్, సునీల్, రాఘవరెడ్డి, ఎన్‌ఎస్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.