దిల్‌షాద్ మృతదేహం
నెల్లూరురూరల్, మే 28 : వివాహమై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని కలివెలపాళెంలో శనివారం జరిగింది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. గ్రామంలో నివాసముంటున్న మీరామోహిద్దీన్, దిల్‌షాద్(36) దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పట్నుంచి వీరికి పిల్లలు లేరు. ఈ క్రమంలో మనస్తాపానికి గురవుతు వస్తున్న దిల్‌షాద్ శుక్రవారం భర్త ధనలక్ష్మీపురంలో కూలి పనికి వెళ్లగానే ఆమె ఇంట్లో ఊరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చుట్టపక్కల వారి ద్వారా సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఆమెను నారాయణ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తండ్రి నూరుసాబ్ మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.