ఘనంగా వాల్మీకి జయంతి

ABN , First Publish Date - 2020-11-01T07:04:51+05:30 IST

మహర్షి వాల్మీకి జయంతిని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కలెక్టరేట్లలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యాలయాల్లో ఇరు జిల్లాల కలెక్టర్లు ఎంవీ రెడ్డి, ఆర్వీ కర్ణన్‌ వాల్మీకి

ఘనంగా వాల్మీకి జయంతి

నివాళులు అర్పించిన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు


ఖమ్మం కలెక్టరేట్‌/  కొత్తగూడెం కలెక్టరేట్‌, అక్టోబరు 31: మహర్షి వాల్మీకి జయంతిని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం  జిల్లాల కలెక్టరేట్లలో శనివారం  ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యాలయాల్లో ఇరు జిల్లాల కలెక్టర్లు ఎంవీ రెడ్డి,  ఆర్వీ కర్ణన్‌ వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంస్కృతంలో ఎన్నో శ్లోకాలు రచించిన మహనీయుడు వాల్మీకి అని కొనియాడారు. రామాయణ మహాకావ్యాన్ని రచించి తల్లిదండ్రుల, అన్నదమ్ముల అనురాగం, భార్యభర్తల బంధం గురించి ఆనాడే మానవాళికి ఎంతో చక్కగా వివరించిన మహామనిషి అని వివరించారు. ఆయన విలువలను ప్రతి ఒక్కరు పాటిస్తూ గిరిజన ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని కోరారు. 


వేటను వృత్తిగా జీవించిన వాల్మీకి పరిస్థితులకు అనుగుణగా మహారుషిలా మారారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. యువత ఏ పని చేస్తున్నా,  నైపుణ్యంగా చేస్తే వాటిల్లో నిష్ణాతులవుతారని అన్నారు.   ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్‌ మధుసూదన్‌రావు, అనుదీప్‌, శిక్షణ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి,  డీఆర్‌వోలు శిరీష, అశోక్‌ చక్రవర్తి, బీసీ సంక్షేమ అధికారులు సురేందర్‌, జి. జ్యోతి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, డీఈవో మదన్‌మోహన్‌, సీపీవో కొండపల్లి శ్రీరాం, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ప్రియాంక, ఉద్యాన అధికారి అనసూయ, పశుసంవర్థకశాఖ అధికారి పురందేశ్వర్‌, ఏవోలు మదన్‌గోపాల్‌, గన్యా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-01T07:04:51+05:30 IST