నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా ఉద్ధవ్‌!

ABN , First Publish Date - 2020-04-10T07:19:09+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఓ అనూహ్య రీతిలో చట్టసభ సభ్యుడు కాబోతున్నారు. గవర్నర్‌ కోటాలో నామినేటెడ్‌ సభ్యుడిగా ..

నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా ఉద్ధవ్‌!

ముంబై, ఏప్రిల్‌ 9: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఓ అనూహ్య రీతిలో చట్టసభ సభ్యుడు కాబోతున్నారు. గవర్నర్‌ కోటాలో నామినేటెడ్‌ సభ్యుడిగా ఎమ్మెల్సీగా ఆయనను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. శాసనసభ ఎన్నికల్లో పోటీచేయకపోయినా ఆయన సీఎం పదవి చేపట్టారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం.. ఆయన 6 నెలల వ్యవధిలో చట్టసభల్లోని ఏదో ఒక దానిలో సభ్యుడు కావాలి. ఎవరైనా శివసేన ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి అసెంబ్లీకి అడుగిడదామనుకున్నా.. 2 నెలల దాకా ఎన్నికలు జరిగే అవకాశాల్లేవు. కరోనా కారణంగా షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగలేదు. దీంతో రాజ్యాంగ సంక్షోభ నివారణకు, సీఎం రాజీనామా చేయకుండా ఉండేందుకు ఆయనను నామినేటెడ్‌ కోటాలో కౌన్సిల్‌ మెంబర్‌గా చేయాలని నిశ్చయించారు.  

Updated Date - 2020-04-10T07:19:09+05:30 IST