Uddhav Thackeray Resigns: క్లైమాక్స్‌కు చేరిన ‘మహా’ సంక్షోభం.. సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామా..

ABN , First Publish Date - 2022-06-30T03:20:01+05:30 IST

బలపరీక్షకు సుప్రీం కోర్టు అనుమతివ్వడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు..

Uddhav Thackeray Resigns: క్లైమాక్స్‌కు చేరిన ‘మహా’ సంక్షోభం.. సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామా..

ముంబై: బలపరీక్షకు సుప్రీం కోర్టు అనుమతివ్వడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. బల పరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోనియా గాంధీకి, శరద్ పవార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బాలా సాహెబ్ ఆశయాలను నెరవేర్చామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పుకొచ్చారు. శివాజీ మహారాజ్ వారసత్వాన్ని కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు.



మహారాష్ట్ర కేబినెట్‌ సమావేశం అనంతరం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తన వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించండని ఉద్ధవ్ ఠాక్రే మంత్రులతో అన్నారు. తన వాళ్లే తనను మోసం చేశారని, కేబినెట్ భేటీ తర్వాత మీడియాకు నమస్కరించి ఉద్ధవ్‌ సచివాలయం నుంచి వెళ్లిపోయారు. మహారాష్ట్రలోని కొన్ని పట్టణాల పేరును మారుస్తూ ఉద్ధవ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఔరంగాబాద్ పేరు శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ పేరు ధారాశివ్‌గా, డీబీ పాటిల్‌ ఎయిర్‌పోర్ట్‌గా నవీముంబై ఎయిర్‌పోర్ట్‌‌ను మార్చుతూ చేసిన ప్రతిపాదనలకు ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Updated Date - 2022-06-30T03:20:01+05:30 IST