అరెస్టు భయంతో మాజీ మంత్రి అదృశ్యం

ABN , First Publish Date - 2021-08-04T13:19:54+05:30 IST

మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనను...

అరెస్టు భయంతో మాజీ మంత్రి అదృశ్యం

ముంబై: మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనను అరెస్టు చేస్తుందనే భయంతో మహారాష్ట్ర హోంశాఖ మాజీమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అదృశ్యమయ్యారు. ఈడీ అధికారులకు దేశ్‌ముఖ్ ఎక్కడ ఉన్నారన్నదీ తెలియరాలేదు. ఇదేవిధంగా అతని కుమారుడు రుషికేష్ లొకేషన్ కూడా తెలియలేదు. దీంతో ఈడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 


అనిల్ దేశ్‌ముఖ్‌కు ఈడీ నుంచి ఇప్పటికే నాలుగుసార్లు సమన్లు జారీ అయ్యాయి.  ఎన్సీపీ నేత అనిల్ దేశ్ ముఖ్, అతని కుమారుడు రుషికేష్ దేశ్‌ముఖ్ సోమవారం ఈడీ విచారణకు హాజరుకావాల్సివుంది. దీనికి వీరు గైర్హాజరయ్యారు. 100 కోట్ల రూపాయల అక్రమ వసూళ్ల ఉదంతంలో ఈడీ దేశ్ ముఖ్‌పై కేసు నమోదు చేసి, నాగపూర్, ముంబైలలోని అతని ఆస్తులపై దాడులు చేసింది. ఈ సందర్భంగా రూ. 4.2 కోట్ల ఆస్తిని జప్తు చేశారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే దేశ్‌ముఖ్ పీఎస్ సంజీవ్ పలాండె, పీఎ కుందన్ షిండేలను అరెస్టు చేసింది.

Updated Date - 2021-08-04T13:19:54+05:30 IST