కరోనా మూడో వేవ్ అడ్డుకునేందుకు ‘మహా’ ప్రణాళిక!

ABN , First Publish Date - 2021-06-24T04:29:12+05:30 IST

డెల్టా ప్లస్.. దేశంలో ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్న కరోనా వేరియంట్ ఇది. ఈ నేపథ్యంలో ‘మహా’ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ కట్టడి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మూడో వేవ్ రాకకు అవకాశాలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో పక్కా వ్యూహాలు రచిస్తోంది.

కరోనా మూడో వేవ్ అడ్డుకునేందుకు ‘మహా’ ప్రణాళిక!

ముంబై: డెల్టా ప్లస్.. దేశంలో ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్న కరోనా వేరియంట్ ఇది. ఇప్పటికే మహారాష్ట్రలోని ఏడు జిల్లాల్లో ఈ వేరియంట్‌కు సంబంధించి మొత్తం 21 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీని వ్యాప్తి వేగం ఇతర వేరియంట్లకంటే అధికమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మహా’ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ కట్టడి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మూడో వేవ్ రాకకు అవకాశాలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో పక్కా వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్ర ఉన్నాతాధికారులు ఇప్పటికే తమ ప్రణాళికకు సంబంధించి ముఖ్య వివరాలను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు ప్రెజెంటేషన్ రూపంలో వివరించారట. కాగా.. ప్లస్ వేరియంట్ల పట్ల అంతగా భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇటీవల స్పష్టం చేశారు. ఇతర వేరియంట్ల కంటే ప్లస్ వేరియంట్ వ్యాప్తి వేగం 0.005 అధికమని ఆయన తెలిపారు. ఈ సంఖ్య చిన్నదే అయినప్పటికీ..ఇతర వేరియంట్ల గణాంకాలకంటే ఎక్కువన్న విషయాన్నీ ఆయన ప్రస్తావించారు. 

Updated Date - 2021-06-24T04:29:12+05:30 IST