Advertisement
Advertisement
Abn logo
Advertisement

కనుల పండువగా మహాపుష్పయాగం

సీఎ్‌సపురం, నవంబరు 28 : ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో ఆదివారం మహా పుష్పయాగం కనులపండువగా జరిగింది. కార్తీక మాసోత్సవం సందర్భంగా నారాయణస్వామి, శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తి స్వామివార్లకు వివిధ రకాల పూలతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. . వివిధ రకాల పూల బుట్టలతో ఆలయం చుట్టూ ప్రదక్షణ చే సి వేద పండితుల వేద మంత్రాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థాన కార్యనిర్వాహణాధికారి ఎన్‌.నారాయణరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కరేడు(ఉలవపాడు): మండలంలోని కరేడు గామ్రంలో వేంచేసిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి వార్ల కల్యాణం ఆదివారం  వేదపండితుల మంత్రోచ్ఛారణలతో వైభవంగా జరిగింది. కార్తీక మాసంలో మహిళా భక్తులు పుణ్యపూజలు ఆచరిస్తూ అమ్మవారిని భక్తిశ్రద్దలతో కొలిచారు. కార్తీక మాసం పురష్కరించుకొని కరేడు, ఉలవపాడు గ్రామల్లోని శ్రీజ్ఞానప్రసూనాంబ, కనకదుర్గమ్మల దేవస్ధానాల్లో శాంతి కల్యాణం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్ని అమ్మవారి ఆశీసులు పొంది తీర్ధప్రసాదాలు అందుకున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో అన్న వితరణ జరగగా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. 

తాళ్లూరు:   గుంటిగంగ సన్నిధిలో ఆదివారం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికజడ్పీటీసీ మారం వెంకటరెడ్డి కో ఆప్షన్‌ సభ్యుడు కరిముల్లాలు ప్రత్యేక పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు. ఆలయ పూజారులు ప్రకా్‌షరావు పంతులు, విజయలక్ష్మిలు అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్‌ కటకంశెట్టి శ్రీనివాసరావు, దేవస్థాన ఆర్‌.ఏకె .శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement