Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతుల మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపిన జేడీ లక్ష్మీనారాయణ

నెల్లూరు: అమరావతి రైతుల మహాపాదయాత్రకు జేడీ లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అన్ని ప్రాంతాల్లో అక్కడి వనరులు, సౌలభ్యం మేరకే అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవసరమైన చోట హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయొచ్చునని అన్నారు. రైతుల పాదయాత్రకు మద్దతిచ్చినవారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. అమరావతి ఉద్యమం ఏ ఒక్కరికో చెందినది కాదని జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.


కాగా ఆదివారం రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లా, బాలాయపల్లి మండలం, వెంకటరెడ్డిపల్లిలోని.. వెంకటగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్రకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. 

Advertisement
Advertisement