మహానాడుకు భారీగా తరలిరావాలి

ABN , First Publish Date - 2022-05-24T03:29:01+05:30 IST

ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జగరనున్న మహానాడుకు మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్‌ అభిమానులు భారీగా తరలిరావాలని కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఉలవపాడులో సోమవారం

మహానాడుకు భారీగా తరలిరావాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఇంటూరి

ఉలవపాడు, మే 23:  ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జగరనున్న మహానాడుకు మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్‌ అభిమానులు భారీగా తరలిరావాలని కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఉలవపాడులో సోమవారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మహానాడు నియోజకవర్గానికి దగ్గరలో జరుగుతున్నందున తెలుగు తమ్ముళ్లకు పండుగను తలపిస్తుందన్నారు.  ఆయా గ్రామపార్టీల నాయకత్వం ముందుండి మహానాడుకు పార్టీ శ్రేణులను తరలించేలా ప్రణాళిక చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు రాచగల్లు సుబ్బారావు, శ్రీనివాసులు, మండల తెలుగు యువత అధ్యక్షుడు తొట్టెంపూడి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.


మహానాడును విజయవంతం చేయాలి


గుడ్లూరు, మే 23 : ఈ నెల 27, 28 తేదీల్లో  ఒంగోలులో జరగనున్న మహానాడుకు గుడ్లూరు మండలం నుంచి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం అన్నారు. మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో స్థానిక ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం వద్ద జనిగర్ల నాగరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ అరాచకపాలన సాగుతుందని, ఈ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు త్వరలోనే  ఉన్నాయన్నారు.  కార్యక్రమంలో నాయకులు ఉమ్మినేని సుబ్బారావు, నరాల మాలకొండారెడ్డి, తాటిపర్తి రామకృష్ణ, పువ్వాడి వేణుగోపాల్‌, మేకపోతుల రాఘవయ్య, పువ్వాడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-24T03:29:01+05:30 IST