కంచిపరమాచార్యతో మాట్లాడుతున్న చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‌బాబు
ఐరాల(కాణిపాకం), మే 25: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహాకుంభాభిషేకాన్ని ఆగస్టు 21వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్లు ధర్మకర్తల మండలి తెలిపింది. ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‌బాబు హైదరాబాదు స్కందగిరిగుట్టలోని కంచిపరమాచార్య స్వామిని కలిసి మహాకుంభాభిషేకం ముహూర్తం పెట్టించారని పేర్కొంది. ఆగస్టు 21న సుముహూర్తాన్ని ఖరారు చేశారని తెలిపింది. ఈఈ వెంకటనారాయణ, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ధర్మేశ్వరగురుకుల్, ఎక్స్అఫిషియో మెంబర్ సోమశేఖర్‌గురుకుల్, వేదపండితులు సీహెచ్‌వీఎస్‌సుబ్బారావు, రాకేష్‌శర్మ వారి వెంట ఉన్నారు.