లవ్‌కేసరి సమంజసం కాదు...

ABN , First Publish Date - 2022-04-17T18:23:38+05:30 IST

లవ్‌కేసరి సమాజానికి సమంజసం కాదని ప్రముఖ సాహితీవేత్త దేవనూరు మహదేవ అభిప్రాయపడ్డారు. చోరీని నియంత్రించే బదులు దోపిడీకి పిలుపునిచ్చే ప్రక్రియ ప్రారంభమైందని విచారం

లవ్‌కేసరి సమంజసం కాదు...

                             - సాహితీవేత్త దేవనూరు మహదేవ


బెంగళూరు: లవ్‌కేసరి సమాజానికి సమంజసం కాదని ప్రముఖ సాహితీవేత్త దేవనూరు మహదేవ అభిప్రాయపడ్డారు. చోరీని నియంత్రించే బదులు దోపిడీకి పిలుపునిచ్చే ప్రక్రియ ప్రారంభమైందని విచారం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో శనివారం దినేశ్‌ అమీన్‌మట్టు రచించిన ‘బేరెయే మాతు’ (మరో మాట) అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవనూరు మహదేవ మాట్లాడుతూ... ఇటీవల కొందరు కత్తి ఝళిపిస్తూ లవ్‌ కేసరికి పిలుపునిచ్చారన్నారు. లవ్‌ జిహాద్‌ చేస్తున్నారని ఆరోపిస్తూ అందుకు ప్రతిగా లవ్‌ కేసరి చేయాలనేది ఎంతవరకు సమంజసమన్నారు. ఏదో ఒక చోట సమస్య తలెత్తిందని సమాజం అంతటికీ ఒకే విధానం తీసుకు రావడం సరికాదన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్త మరళు సిద్దప్ప, ప్రొఫెసర్‌ సిద్దరామయ్య, రచయిత పుట్టస్వామి, అనంతనాయక్‌, అక్షతముంచద కట్టితో పాటు పలువురు పాల్గొన్నారు.  


Updated Date - 2022-04-17T18:23:38+05:30 IST