Mahabalipuramలో వెనక్కి వెళ్లిన సముద్రం

ABN , First Publish Date - 2022-04-22T14:13:58+05:30 IST

చెంగల్పట్టు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మహాబలిపురంలో బుధవారం సాయంత్రం హఠాత్తుగా సముద్రం వెనక్కి వెళ్లడతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నీరు వెనక్కి

Mahabalipuramలో వెనక్కి వెళ్లిన సముద్రం

                      - బయల్పడిన ఆలయ కలశం, రాతి స్తంభాలు


ప్యారీస్‌(చెన్నై): చెంగల్పట్టు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మహాబలిపురంలో బుధవారం సాయంత్రం హఠాత్తుగా సముద్రం వెనక్కి వెళ్లడతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నీరు వెనక్కి వెళ్లడంతో తీరంలో పురాతన ఆలయ కలశం, రాతి స్తంభాలు, ఇటుకరాళ్లు బయల్పడ్డాయి. వాటిపై పరిశోధన చేయాలని పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మొదటి నరసింహ పల్లవ రాజు హయాంలో మహాబలిపురం తీరంలో సముద్రం వెనక్కివెళ్లిన సమయంలో తీరం వెంబడి చిన్న చిన్న ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. సముద్రంలో అలలు ఎగిసిపడే సమయంలో ఈ ఆలయాలు నీట మునుగుతుంటాయి. ఈ నేపధ్యంలో, బుధవారం సాయంత్రం మరోమారు సముద్రం వెనక్కి వెళ్లడంతో తీరంలో బయటపడిన కలశాలు, రాతి స్తంభాలు తదితర పురాతన కళాఖండాలను వీక్షించేందుకు గురువారం ఉదయం నుంచే స్థానికులు, పర్యాటకులు మహాబలిపురంలో గుమిగూడారు. ఇదిలా ఉండగా, ఈ పురాతన రాతి స్తంభాలు, కలశాల వివరాలు సేకరించనున్నట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-04-22T14:13:58+05:30 IST