నేలలోని కాలుష్య కారకాలను ఏరిపారేసే బ్యాక్టీరియా

ABN , First Publish Date - 2020-02-22T07:49:57+05:30 IST

నేల కాలుష్యానికి చెక్‌పెట్టే సరికొత్త బ్యాక్టీరియాను అమెరికాలోని కార్నెల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి ‘మ్యాడ్‌సెనియానా’ అని పేరుపెట్టారు

నేలలోని కాలుష్య కారకాలను ఏరిపారేసే బ్యాక్టీరియా

న్యూయార్క్‌, ఫిబ్రవరి 21: నేల కాలుష్యానికి చెక్‌పెట్టే సరికొత్త బ్యాక్టీరియాను అమెరికాలోని కార్నెల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి ‘మ్యాడ్‌సెనియానా’ అని పేరుపెట్టారు. బొగ్గు, గ్యాస్‌, చమురు, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో కాలుష్యకాసారాలుగా మారిన నేలల్లోకి పాలీ క్లినిక్‌ అరోమాటిక్‌ హైడ్రోకార్బన్‌(పీఏహెచ్‌) రసాయనాలు ఇంకుతుంటాయి. వాటి ప్రభావంతో పరిసర ప్రాంత ప్రజలకు కేన్సర్‌ వంటి జబ్బులు వచ్చే అవకాశాలూ ఉంటాయి. అలాంటి ప్రమాదకర పీఏహెచ్‌లను నిర్వీర్యం చేసి, వాటి స్థానంలో నేలలోకి పోషకాలను భర్తీ చేయడం మ్యాడ్‌సెనియానా ప్రత్యేకత. ఈ బ్యాక్టీరియా కాలుష్యభరిత నేలల్లో పెరిగే చెట్లు, మొక్కల నుంచి కార్బన్‌ను పీల్చుకొని.. దానికి బదులుగా వాటికి నైట్రోజన్‌, ఫాస్పరస్‌ వంటి పోషకాలను అందిస్తుందని తాజా అధ్యయనంలో గుర్తించారు.

Updated Date - 2020-02-22T07:49:57+05:30 IST